అభిషేకం సీరియల్ నటి ఎన్ని సినిమాల్లో నటించిందో తెలుసా ?

Abhishekam serial actress latha :తెలుగులో బుల్లితెర మీద వచ్చే సీరియల్స్ మంచి ఆదరణ ఉంటోంది. ఇక ఈటీవీలో వస్తున్న అభిషేకం సీరియల్ బాగా రన్ అవుతోంది. విశేష ప్రేక్షకాదరణ పొందుతున్న ఈ సీరియల్ లో నెగెటివ్ రోల్ లో నటిస్తున్న లత తన అందంతో, అభినయంతో ఆకట్టు కుంటోంది. ఈమె అసలు పేరు రూపా . అందరూ స్వీటీ అని ముద్దుగా పిలుస్తారు.

ఇద్దరు అన్నయ్యలు గల లత అక్టోబర్ 31న జన్మించింది. చిన్నతనం నుంచి నటన మీద ఆసక్తి గల లత డిగ్రీ పూర్తయిన వెంటనే మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. పలు యాడ్స్ చేస్తూ సినిమాల్లోకి అడుగుపెట్టింది. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, కృష్ణగాడి వీర ప్రేమ గాథ, రారండోయ్ వేడుక చూద్దాం, డిస్కో రాజా వంటి సినిమాల్లో తన నటనతో ఆకట్టుకుంది.

ఇక స్మాల్ స్క్రీన్ మీద ఛాన్స్ లు రావడంతో టివి రంగంలోకి లత అడుగుపెట్టింది. ఆడదే ఆధారం సీరియల్ లో వైష్ణవి క్యారెక్టర్ లో నటించి బుల్లితెరమీద తొలి సీరియల్ తోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తమిళ సీరియల్స్, వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్న ఈమె ప్రస్తుతం అభిషేకం సీరియల్ లో దూసుకెళ్తోంది.