రకుల్ సినిమా ప్రస్థానం ఎలా మొదలు అయిందో తెలుసా ?

Telugu actress rakul preet singh : ఎవరైనా ఒక మెట్టు ఎక్కితే చాలు కళ్ళు నెత్తికి ఎక్కేస్తాయి. కానీ కొందరు తమ పాతరోజులు, తమకు సహకరించిన వారిని ఎన్నటికీ మరిచిపోరు. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా తన ఫామిలీ సపోర్ట్ తో పాటు తన దగ్గర పనిచేసే మేనేజర్, టీమ్ వలన ఈ స్థాయిలో ఉన్నానని సగర్వంగా చెప్పుకొచ్చింది.

మిస్ ఇండియాగా కిరీటం గెల్చుకున్న రకుల్ మోడలింగ్ నుంచి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే వెంటనే ఛాన్స్ లు రాలేదు. ముందుగా బాలీవుడ్ లో ఛాన్స్ వచ్చాకే తెలుగులో అవకాశాలు వచ్చాయి. కెరటం సినిమాలో చేసినప్పటికీ వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీతో బ్రేక్ వచ్చింది.

అలా హిట్ కొట్టిన రకుల్ టాలీవుడ్ లో స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. వైష్ణవ తేజ్ తో ఒక సినిమా, నితిన్ తో ఒక సినిమా చేస్తున్న ఈ అమ్మడు ఇండస్ట్రీకి వచ్చి అప్పుడే ఏడేళ్లు అయిపోయింది. ఈసందర్బంగా తన ఆనందాన్ని సోషల్ మీడియాలో శ్రీ చేస్తూ, తన విజయానికి తన టీమ్ కారణమని చెప్పుకొచ్చింది. నిర్మాతలకు , దర్శకులకు , హీరోలకు, తోటినటీనటులకు కృతజ్ఞతలు తెల్పింది.