మనసు మమత సీరియల్ నటుడు అజిత్ ఎన్ని సినిమాల్లో నటించాడో చూడండి

Manasu mamatha Serial Ajith :తెలుగులో టివి సీరియల్స్ గల క్రేజ్ ఎక్కువే. ఇక ఈటీవీలో ఎప్పటినుంచో మంచి ఆదరణతో ప్రసారమవుతున్న మనసు మమత సీరియల్ కి గల ఆదరణ చాలా ఎక్కువగానే ఉంది. ఇందులో నటిస్తున్న నటుడు అజిత్ తన అందంతో ,నటనతో ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటున్నాడు. అజిత్ అసలు పేరు అభిషేక్. యితడు తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట సమీపంలో తిమ్మాపురం గ్రామంలో జన్మించాడు.

అజిత్ తండ్రి ప్రయివేట్ జాబ్ చేస్తున్నాడు. తల్లి గృహిణి. హైదరాబాద్ లోనే పెరిగిన అభిషేక్ ని ఇంట్లో వాళ్ళు నాని అని ముద్దుగా పిలుస్తారు. వాళ్ళ పేరెంట్స్ కి ఒక్కగానొక్క కొడుకు కావడంతో గారాబంగా పెంచారు. భాష్యం స్కూల్ లో పాఠశాల విద్య పూర్తిచేసిన అజిత్ గీతాంజలి కాలేజ్ ఆఫ్ టేక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ కాలేజీలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తిచేసాడు. క్రికెట్ ఆడడం, చూడడం చేస్తుంటాడు.

అజిత్ కి జూనియర్ ఎన్టీఆర్, నాని అంటే ఇష్టం. చిన్ననాటి నుంచి యాక్టింగ్ మీద మక్కువ ఉండేది. అందుకే స్కూల్, కాలేజీలలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో చాలా యాక్టివ్ గా పాల్గొనేవాడు. బిటెక్ అయ్యాక వెబ్ సిరీస్ చేసిన అజిత్ ఆతర్వాత కలియుగ వేగం, మహా ప్రస్థానం వంటి షార్ట్ ఫిలిమ్స్ లో చేసాడు. ఆర్డీ ఎక్స్ లవ్ అనే మూవీలో చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు.