చైతు,సామ్ పెళ్ళికి సాయం చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా ?

Samantha and naga chaitanya :టాలీవుడ్ లో నాగ చైతన్య , సమంతల ప్రేమకథ పరిశీలిస్తే, పదేళ్ల కింద పరిచయం అయినా మూడేళ్ల కింద మూడుముళ్ల బంధంతో ఏకమయ్యారు. ప్రేమించగానే సరికాదు, ఒప్పుకోవాలి. ఒప్పించాలి. వీళ్ళ విషయంలో కూడా ఇలా జరగడానికి చాలా శ్రమ పడాల్సి వచ్చింది. నిజానికి ఓ ఐదేళ్లకు పైగానే వీళ్ల లవ్ స్టోరీ రంజుగా సాగింది. ఈ ఇద్దరి ప్రేమను అర్థం చేసుకుని పెళ్లి వరకు వీళ్ల వ్యవహారాన్ని తీసుకు రావడంలో ఓ వ్యక్తి కీలక పాత్ర వహించాడు. ఆ ఒక్కరు లేకపోతే మాత్రం ఈ రోజు సమంత అక్కినేని కోడలు అయ్యేది కాదు.

ఈ సంచలన విషయాన్ని స్వయంగా సమంత అక్కినేని చెప్పుకొచ్చింది. అది ఎవరో కాదు, రానా దగ్గుబాటి. అవును, ఈ మధ్యే తన టాక్ షోకు వచ్చిన రానాకు సభాముఖంగా కృతజ్ఞతలు చెబుతూ … మీరు లేకపోతే చైతూతో తన పెళ్లి అయ్యుండేది కాదని చెప్పిందంటే రెండు కుటుంబాలను రానా ఎంతగా కన్విన్స్ చేసాడనేది అర్థమవుతుంది. చిన్నప్పటి నుంచి కూడా చైతూకు అన్ని విధాలుగా తోడుగా రానా నిలిచి, చివరికి పెళ్లి విషయంలో కూడా పూర్తిగా అండగా నిలిచాడు.

నిజానికి చైతూను ప్రేమించానని చెప్పగానే అక్కినేని కుటుంబంలో ఎవరూ ఒప్పుకోలేదు. ఒప్పించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎందుకంటే చైతన్యను పెళ్లి చేసుకోవాలంటే ఒక్క కుటుంబం కాదు రెండు పెద్ద కుటుంబాలు ఒప్పుకోవాలి. అక్కినేని కుటుంబానికి వారసుడు అయితే.. దగ్గుబాటి కుటుంబానికి మేనల్లుడు కదా. అందుకే ఆ రెండు కుటుంబాలు ఒప్పుకుంటే కానీ చైతూ పెళ్లి అవ్వదు. సమంత, చైతూ ప్రేమించుకున్న విషయం తెలిసి కుటుంబాల్లో ఒప్పించడానికి రానా తనవంతు ప్రయత్నం చేసాడు.

ఏ మాయ చేసావే సినిమాతో పరిచయం అయిన సమంత, ఆ తర్వాత తక్కువ టైమ్‌లోనే టాప్ హీరోయిన్ గా మారింది. వరస విజయాలతో తెలుగులో స్టార్ అయిపోయింది.పెళ్ళికి ముందే కాదు, పెళ్లైన మూడేళ్ల తర్వాత కూడా సమంతకు అదే ఇమేజ్ కంటిన్యూ అయిందంటే ఆమె రేంజ్ ఎలాంటిదో చెప్పక్కర్లేదు.ఈమె ఒప్పుకుంటే వరస అవకాశాలు ఇవ్వడానికి దర్శక నిర్మాతలు ఎప్పుడూ సిద్ధమే. మరోవైపు చైతూ కూడా వరస సినిమాలతో దూసుకెళ్తున్నాడు.