అక్కినేని కోడలి ప్రతిపాదనకు యంగ్ రెబెల్ స్టార్ నో…ఎందుకో తెలుసా ?

Telugu Actress Samantha : బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస చిత్రాలతో సత్తా చాటుతున్నాడు. అన్నీ పాన్ ఇండియా మూవీస్ కావడం విశేషం. కరోనా కారణంగా షూటింగ్ లేట్ అవ్వడంతో ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా త్వరితగతిన పూర్తయ్యేలా దృష్టిపెట్టాడు. ఇంకోవైపు బాలీవుడ్ సంచలన దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం లో ఆదిపురుష్ అనే సినిమా తెరకెక్కు తోంది. అలాగే బాలీవుడ్ నటి దీపికా పదుకొనేతో కలిసి ప్రభాస్ ఓ సినిమా చేయనున్నాడు. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ సినిమా తెరకెక్కించబోతున్నాడు. అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటించనున్నాడు.

అయితే, ఇక సినిమాలు తగ్గించి, ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌లో శామ్-జామ్ అనే ఓ టాక్ షో చేస్తున్న అక్కినేని వారి కోడలు సమంత ఈ కార్యక్రమం కోసం ఏకంగా కోటి 80లక్షల రూపాయల పారితోషికం తీసుకుంటున్నట్లు వినిపిస్తోంది. ఇక్కడ ఈ షోలో సమంత కేవలం హోస్ట్ చేయడమే కాకుండా తెరవెనక కూడా కొన్ని పనులు చక్కబెట్టాల్సి ఉంది. ముఖ్యంగా హీరోల్ని ఈ షోకు రప్పించే బాధ్యత కూడా ఆమె వహించాలన్నది కండీషన్. ఇవన్నీ అప్పగించాకే దాదాపు కొట్టిన్నరకు పైగా ముట్టజెబుతున్నారు. అందుకు అనుగుణంగా విజయ్ దేవరకొండ, రానా, నాగ్ అశ్విన్ తదితరులను శామ్-జామ్ ప్రోగ్రాంలో ఇంటర్వూ చేసింది.

సమంత షోకు మెగాస్టార్ చిరంజీవి కూడా వచ్చారు. ఎందుకంటే, ఆహా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ స్వయంగా అల్లు అరవింద్ నిర్వహించడం వలన చిరు వచ్చారు. అయితే ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ను తన షోకు రావాలని ఆహ్వానిస్తే, సున్నితంగా నో చెప్పేశాడట. కావాలని ఏవైడ్ చేయడం కాకుండా, ప్రస్తుతం వరుస షూటింగ్స్ తో బిజీగా ఉండడం వలన ఇలాంటి టైమ్ లో సమంత ఇంటర్వ్యూకు రావడం తనకు కుదరదని ప్రభాస్ క్లారిటీగా చెప్పేశాడట. పైగా ప్రభాస్‌ మామూలుగానే ఇంటర్వ్యూలు ఇవ్వడం, ప్రత్యేక కార్యక్రమాలకు హాజరవ్వడం తక్కువే. ఇక షూటింగ్స్ తో బిజీ. అందుకే రాలేనని చెప్పేశాడట.