Movies

నిహారిక పెళ్లి కి ఎంతమంది సెలబ్రిటీస్ వస్తున్నారు తెలుసా?

Niharika marriage :మెగా డాటర్ నిహారిక పెళ్లి గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నది. నిహారిక పెళ్లి కుటుంబ సభ్యుల సమక్షంలో రాజస్థాన్ ఉదయపూర్ లో అంగరంగ వైభవంగా జరగనుంది. పెళ్లి పనులను వరుణ్ తేజ్ దగ్గరుండి చూసుకుంటున్నారట. ఫ్రీ వెడ్డింగ్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి మెగా కుటుంబ సభ్యులందరూ చాలా హడావుడి చేస్తున్నారు. మెగా కుటుంబంలో చిరంజీవి రామ్ చరణ్ అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ తప్పించి అందరూ ఉదయపూర్ లోనే ఉన్నారు వీరు సినిమా షూటింగ్ ల కారణంగా ఉదయపూర్ వెళ్ళలేదు సోమవారం ఉదయం వీరందరూ ఉదయపూర్ చేరుకుంటారని సమాచారం. నిహారిక పెళ్లి బాధ్యతను చిరంజీవి తీసుకున్నాడు కరోనా కారణంగా కుటుంబ సభ్యులు మరియు కొంత మంది సెలబ్రిటీలు మాత్రమే పెళ్లికి ఆహ్వానించారు.

అయితే సీనియర్ హీరోలైనా వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ వంటి వారికి చిరంజీవి ప్రత్యేకంగా ఫోన్ ద్వారా పిలిచినట్లు సమాచారం.వీరు మాత్రమే కాకుండా రానా, నితిన్, రామ్, నాగ చైతన్య, సమంత దంపతులతో పాటు పూజా హెగ్డే, రష్మికను కూడా వివాహానికి ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

వీరితో పాటు ప్రముఖ దర్శకులు కొరటాల శివ, కోదండరామిరెడ్డి, రాఘవేంద్ర రావు ఆర్కే మీడియా, మైత్రి మూవీస్ మేకర్, దిల్ రాజు, దానయ్య, సురేష్ బాబు వంటి నిర్మాతలకు కూడా వివాహ ఆహ్వానం అందినట్లు సమాచారం. నాగబాబు ముద్దుల తనయ నిహారికకు పెళ్లి లాంఛనంగా నాగబాబు దాదాపు పది కోట్ల రూపాయలను నిహారికకు ఇస్తున్నట్లు సమాచారం