Movies

మిడిల్ క్లాస్ కొండలరావు రియల్ లైఫ్…ఎవరికి తెలియని నమ్మలేని నిజాలు

Middle Class Melodies Kondalrao :దశ ఉండాలి గానీ రాత్రికి రాత్రి స్టార్ హీరో అయిపోయిన వాళ్ళున్నారు. అలా చూస్తే మిడిల్ క్లాస్ మెలోడీ తో తన నటనతో అందరినీ ఆకట్టుకుని కొండలరావు స్టార్ హీరో అయ్యాడు. ఆనంద్ దేవరకొండ, వర్ష హీరో హీరోయిన్స్ గా చేసిన ఈ సినిమాలో కొండలరావు పాత్ర వేసి, గోపరాజు రమణ మంచి మార్కులు కొట్టేసాడు. దీంతో ఈయనకు వరుస ఛాన్స్ లు వచ్చి పడ్డాయి.

పైగా ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ తో థియేటర్లు లేకపోవడంతో ఓటిటి మీదే ఆధార పడుతున్నారు. ఏ భాషలో కావాలంటే ఆ భాషలో రిలీజ్ చేసుకునే ఛాన్స్ వచ్చింది. ఇప్పటికే కొన్ని సినిమాలు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ మీద విడుదలై అందరి దృష్టిని ఆకర్షించాయి. సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా లాంటి సూర్య నటించిన భారీ చిత్రాలు కూడా ఓటిటి ద్వారా రిలీజయ్యాయి. ఇక గత వారం విడుదలైన మిడిల్ క్లాస్ మెలోడీస్ మంచి హిట్ అందుకుంది.

హీరో తండ్రిగా కొండలరావు పాత్రలో గోపరాజు రమణ చాలా బాగా నటించారు. మధ్య తరగతి కుటుంబంలో వాస్తవానికి దగ్గర గా ఉండే పాత్రలతో ఈ సినిమా తెరకెక్కిం చారు. తనలో ఉన్న నటనను బయటకు తీయడానికి రమణకు ఈ మూవీ ద్వారా మంచి ఛాన్స్ వచ్చింది. గతంలో కొన్ని సినిమాలు చేసినా, ఈ సినిమా స్పెషల్ గా గుర్తింపు తెచ్చిందని రమణ అంటున్నారు. అందుకే పలు సినిమాల్లో ఛాన్స్ లు వస్తున్నాయట.