మెగాస్టార్ డాన్స్ ని చిరాకుపడిందెవరు…ఎందుకో తెలుసా ?

chiranjeevi dance :ఇప్పుడంటే మెగాస్టార్ అయ్యాడు గానీ మొదట్లో హీరోగా రాణించడానికి చిరంజీవి ఎన్ని పాట్లు పడ్డాడో , ఎంత కష్టపడ్డాడో చెప్పలేం. చిన్న‌గా కెరీర్‌ స్టార్ట్ చేసి క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా, విల‌న్‌గా, హీరోగా ఎంట్రీ ఇచ్చి నెంబ‌ర్ వ‌న్ హీరో అయ్యాడు. ఇప్పుడు 152వ సినిమా ఆచార్య చేస్తున్నారు. ఇక ప్ర‌ముఖ ద‌ర్శ‌క నిర్మాత ప్ర‌త్య‌గాత్మ త‌న‌యుడు కె.వాసు డైరెక్ట్ చేసిన చిరంజీవి రెండో మూవీ ప్రాణం ఖరీదు సమయంలో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. స్వాతంత్య్రానికి పూర్వం జరిగిన కథ కావడంతో అందుకు తగ్గట్లు డైరెక్టర్ వాసు కాస్ట్యూమ్స్ పరంగా కూడా కేర్ తీసుకున్నారు. ఎండాకాలంలో షూటింగ్ చేశారు. ఉదయం ఏడు గంటల నుండి పదకొండు గంటల వరకు షూటింగ్ చేసేవారు.

మళ్లీ మధ్యాహ్నం మూడు నుండి చీకటిపడే దాకా షూటింగ్ సాగేది. పేద యువతి మానం ఖరీదు రూ.25 అయితే, ఓ గొప్పవాడి కోపం ఖరీదు ఓ ప్రాణం అనే కోణంలో సినిమా చిత్రీకరించారు. మొత్తం 45 రోజుల పాటు చిత్రీక‌రించారు. చిరంజీవి, చంద్ర‌మోహ‌న్‌, జ‌య‌సుధ‌, త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రం ముందుగా విడుద‌లైంది. చిరు తొలిసినిమా పునాదిరాళ్ళు ఆలస్యంగా రిలీజయింది. అగ్ర క‌థానాయ‌కుడిగా చిరంజీవి ఎద‌గ‌డానికి డాన్స్, ఫైట్స్‌ ప్ర‌ధాన కార‌ణాలుగా చెబుతారు. డాన్స్‌, ఫైట్స్ లేకుండా దాదాపు చిరంజీవి సినిమాలను ఊహించ‌లేం. అలాంటి మెగాస్టార్ డాన్స్ చేస్తుంటే డైరెక్ట‌ర్ విసుకున్నాడట. అవును ప్రాణం ఖరీదు డైరెక్టర్ అలా విసుక్కున్నారట.

ఈ సినిమా షూటింగ్ చేసే స‌మ‌యంలో యూనిట్ అంతా రాజ‌మండ్రి అప్స‌రా హోట‌ల్‌లో బసచేశారు. డైరెక్ట‌ర్ వాసు రెండో ఫ్లోర్‌లో ఉంటే, చిరంజీవి మ‌రికొంత మంది ఫ‌స్ట్ ఫ్లోర్‌లో ఉండేవారు. రాత్రి వేళ అంద‌రూ ప‌డుకుంటే.. చిరంజీవి మాత్రం టేప్ రికార్డ్‌లో పాట‌ల‌ను పెద్ద‌గా పెట్టుకుని దానికి త‌గిన‌ట్లు స్టెప్పులేసేవారు. డైరెక్ట‌ర్ వాసు పాట‌ల వ‌చ్చే శ‌బ్దంతో డిస్ట్ర‌బ్ అయ్యేవాడు. రెండు రోజులు భ‌రించిన డైరెక్ట‌ర్.. మూడోరోజు ‘ఎవ‌ర‌య్యా గోల చేస్తున్నారు’ అని అరిచాడట. దానికి అసిస్టెంట్స్ డైరెక్టర్స్ వచ్చి మన వాడే సార్, చిరంజీవి డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడు అని చెప్పారు. సరే! కొంచెం సౌండ్ త‌గ్గించుకుని ప్రాక్టీస్ చేసుకోమ‌ని చెప్పండి..నాకు నిద్ర ప‌ట్ట‌డం లేదు’ అని వాసు అన్నాడు. ఇక సినిమా కమర్షియల్‌గా ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేదు.