ఈ హీరోని గుర్తు పట్టారా…ఇప్పుడు ఏమి చేస్తున్నాడో తెలుసా?

Hero Suresh :ఇండస్ట్రీ చాలా చిత్ర విచిత్రమైనది. ఎప్పుడు ఎవరిని అందలం ఎక్కిస్తుందో, ఎవరికి ఛాన్సులు ఇప్పిస్తుందో తెలీదు. కానీ చిన్న వేషం వచ్చినా చాలు అని తృప్తి పడే స్టార్స్ కూడా ఉన్నారు. ఒకప్పుడు హీరోలుగా రాణించి ఇప్పుడు ఎలాంటి వేషం ఇచ్చినా రెడీ అనేవాళ్లలో హీరో సురేష్ ఒకడు. దాదాపు 270సినిమాల్లో నటించిన సురేష్ డైరెక్టర్ గా, నిర్మాతగా కూడా మారి తన అదృష్టం పరీక్షించుకున్నాడు.

శ్రీ కాళహస్తిలో 1963ఆగస్టు 26న గోపీనాధ్, రాధాదేవిలకు సురేష్ జన్మించాడు. యితడు హీరోగా రాణించడమే కాకుండా తన విలక్షణ విలనిజంలో ఆకట్టుకున్నారు. అయితే చిన్న చిన్న రోల్స్ పోషిస్తూ సీరియల్స్ లో కూడా నటిస్తున్నాడు. సురేష్ తాతయ్య సినిమాలకు సాంగ్స్, పద్యాలూ రాయడం వలన ఆ ప్రభావం అతడిపై పడింది. అలా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. తమిళ చిత్రం ద్వారా 1981లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సురేష్ రామదండు మూవీతో తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చి, తమిళ, తెలుగు సినిమాల్లో బిజీ అయ్యాడు.

హీరోగా ఓ వెలుగు వెలిగి, తర్వాత విలన్ గా చేసాడు. 2002లో సినిమాకు నిర్మాతగా వ్యవహరించి, కొన్ని సినిమాలకు డబ్బింగ్ ఆర్టిస్టుగా చేసాడు. అనిత అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, ఇద్దరి మధ్యా మనస్పర్థలు రావడంతో విడాకులు ఇవ్వడం, రైటర్, నిర్మాత రాజేశ్వరి అనే ఆమెను రెండో పెళ్లి చేసుకోవడం అయింది. సురేష్ కొడుకు నిఖిల్ అమెరికాలో ఎంబీఏ చేస్తున్నాడు. అతడికి సినిమాలపై ఇంట్రెస్ట్ లేదు. మొదటి భార్యతో విడిపోయినా ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ గా ఉంటున్నారు. ఆమె వేరే వ్యక్తిని పెళ్లాడారు. సురేష్ మై నేమిజ్ మంగతాయారు, మాయా ఇంటి మహాలక్ష్మి, రాజేశ్వరి కళ్యాణం, నాటకం ఇలా పలు సీరియల్స్ నిర్మించాడు.