MoviesTollywood news in telugu

అకీరానందన్ గురించి మీకు తెలియని నిజాలు….అసలు నమ్మలేరు

Pawan Son Akira Nandan : మెగాస్టార్ తమ్ముడిగా ఇండస్ట్రీకి వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ఇమేజ్ తో తనకంటూ ఓ క్రేజ్ క్రియేట్ చేసుకున్నారు. పవన్ ని అభిమానించడమే కాదు, దేవుడిగా కొలిచే ఫాన్స్ ఉన్నారు. అంతలా పవన్ తన ఛరిష్మాతో ముద్రవేసాడు. జనసేన పార్టీ పెట్టిన పవన్ ప్రస్తుతం సినిమాల్లో కూడా చేస్తున్నాడు. అయితే వచ్చే జనరల్ ఎన్నికల నాటికి రాజకీయాల్లో పూర్తిగా బిజీ గా మారిపోతే స్క్రీన్ మీద కనిపించడం కుదరకపోవచ్చు. మరి ఇలాంటప్పుడు పవన్ స్థానాన్ని భర్తీ చేసేదెవరని అందరూ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

మెగా డాటర్ నిహారిక పెళ్ళిలో మెరిసిన పవన్ కొడుకు అకిరా ఆరడుగుల బులెట్ లా మెరిసి కత్తిలా ఉన్నాడనిపించాడు. పవన్, రేణు దేశాయ్ ప్రేమకు, పెళ్ళికి గుర్తుగా 2004 లో హైదరాబాద్ లో అకిరా జన్మించిన 5ఏళ్లకు అంటే 2009లో పవన్, రేణు పెళ్లయింది. ఆతర్వాత ఆద్య పుట్టింది. ఇక అకీరాకు ఊహ తెలిసే సమయంలో పవన్, రేణు విడిపోయారు. 16ఏళ్ళవయసున్న అకిరా ఇంతవరకూ డాన్స్, నటనలో ఎలాంటి శిక్షణ తీసుకోలేదు. మరి మెగాస్టార్ కుటుంబం నుంచి బన్నీ, రామ్ చరణ్ మొదలు, వైష్ణవ తేజ్ వరకూ అందరూ నటనపై చిన్నప్పటి నుంచి శిక్షణ తీసుకున్నారు.

ఇప్పటికే 6. 4అడుగుల ఎత్తున్న అకీరాకు నటన నేర్చుకోవడం పెద్ద కష్టం కాదని, అది బ్లడ్ లోనే ఉందని కొందరు అంటున్నారు. ప్రభాస్, వరుణ్ తేజ్ ల కన్నా రెండడుగులు ఎక్కువే ఉన్నాడు. నిహారిక పెళ్ళిలో అతడి డ్రెస్సింగ్ , లుక్ చూస్తే నటుడిగా రాణిస్తాడని ఈజీగా చెప్పేయొచ్చు. అకీరాను ఇండస్ట్రీకి పంపే ఉద్దేశ్యం లేదని రేణు చెప్పినప్పటికీ పవన్, చిరంజీవి కూడా అకీరాను నటనవైపు తీసుకురావాలని భావిస్తున్నారు. ప్రస్తుతం అకిరా ఫారిన్ లో చదువుతూ, తన ఖర్చులను తానే సంపాదించు కుంటున్నాడు. పవన్ ఓ కాల్ చేస్తే చాలు, భారీ బడ్జెట్ మూవీస్ అకీరాతో తీయడానికి నిర్మాతలు కూడా కాచుకుని వున్నారు. పిల్లలు స్వశక్తితో ఎదగాలన్నది రేణు యోచన. చూద్దాం భవిష్యత్తులో ఎలా జరుగుతుందో!