MoviesTollywood news in telugu

ఈ యాంకర్స్ ఆస్తుల విలువ తెలిస్తే షాక్ అవ్వాలసిందే…!

Telugu Anchors Remuneration : టివి రంగం విస్తరించే కొద్దీ యాంకర్స్ వ్యవస్థ బాగా పాపులర్ అవుతూ వస్తోంది. సమయ స్పూర్తితో మాట్లాడ్డం, పంచ్ డైలాగులు , ఆకట్టుకునే తత్త్వం అన్నీ కలగలసి ఉంటేనే యాంకర్ గా రాణిస్తారు. నిజానికి ఫీమేల్ యాంకర్స్ కంటే మేల్ యాంకర్స్ రాణించడం కొంచెం కష్టం. అయితే మేల్ యాంకర్స్ లో రవి, ప్రదీప్ , సుడిగాలి సుధీర్, హైపర్ ఆది ఇలా కొందరు మంచి పేరు తెచ్చుకుని, దూసుకుపోతున్నారు. సొంతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నారు. మరి వీళ్ళు ఎంత తీసుకుంటారో, ఎంత సంపాదించారో వంటి విషయాల్లోకి వెళ్తే, షాకవ్వాల్సిందే.

ప్రదీప్ మాచిరాజు టాప్ యాంకర్ గా విలక్షణ గుర్తింపు తెచ్చుకున్నాడు. బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్, గడసరి అత్త సొగసారి కోడలు, అదుర్స్, నర్తనశాల, ఎక్స్ ప్రెస్ రాజా, ఢీ , కిక్ వంటి ఏడు రకాల షోలకు యాంకర్ గా చేస్తున్నాడు. ఇందులో కొన్ని షోస్ ఇంకా నడుస్తున్నాయి. కొంచెం టచ్ లో ఉంటె చెబుతా అనే సొంత షో కూడా చేసాడు. రోజుకి 18గంటలు షోస్ లోనే గడిపే ప్రదీప్ 30రోజుల్లో ప్రేమించడం ఎలా అనే మూవీలో చేసాడు. అయితే ఒక్కో షోకి 3లక్షల వరకూ తీసుకుంటాడని, సినిమా ఫంక్షన్ అయితే 5లక్షలు ముట్టజెబుతారని, ఇటీవల చేసిన సినిమాకు 35లక్షలు రెమ్యునరేష కూడా అందుకున్నాడని, మొత్తం మీద 10కోట్ల ఆస్తులున్నట్లు టాక్.

ఇక యాంకర్ రవి చేతిలో ఐదు షోస్ నడుస్తున్నాయి. సమ్ థింగ్ స్పెషల్, ఢీ జూనియర్స్, కిరాక్ కామెడీ, మొండిమొగుడు పెంకి పెళ్ళాం, పటాస్, గ్యాంగ్ లీడర్ , సూపర్ మామ, సరిలేరు మీ కెవ్వరు వంటి షోస్ చేసాడు. ఇంకా కొన్ని నడుస్తున్నాయి. నెలకు 20లక్షలు తీసుకుంటాడట. బంజారా హిల్స్ లో కోటి రూపాయల ఫ్లాట్ తో సహా 5కోట్ల వరకూ ఆస్తులున్నాయని టాక్. జబర్దస్త్, ఢీ పోవెపోరా షోస్ తో ఆకట్టుకుని సినిమాల్లో కూడా ఎంట్రీ ఇచ్చిన సుడిగాలి సుధీర్ రోజుకి లక్ష తీసుకుంటున్నాడట. సినిమా ఫంక్షన్స్ కి 2లక్షలు వరకూ తీసుకునే ఇతడికి 5కోట్ల ఆస్తులున్నట్లు తెలుస్తోంది. జబర్దస్త్ ద్వారా మంచి పేరు తెచ్చుకుని, కామెడీతో కట్టిపడేసే హైపర్ ఆది కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రైటర్, ఆర్టిస్టు కూడా అయిన ఆదికి సొంతూరులో 20ఎకరాల పొలం, సొంతిల్లు, నాలుగు ఫ్లాట్స్ , మూడు కార్లు, భారీగా బంగారం అన్నీ కలిపి 5కోట్ల దాకా ఆస్తులున్నట్లు టాక్.