Healthhealth tips in telugu

సమయానికి ఆహారం తీసుకోకపోతే….అది తగ్గుతుందట!

Food Timeings :సాధారణంగా పిల్లలు ఆకలి అనగానే పెద్దవారు ఎదో ఒకటి పెట్టేస్తూ ఉంటారు. అప్పుడు సమయం ఎంత అయిందో కూడా పట్టించుకోరు. అలాగే చాలా మంది పెద్దవారు ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది తినేస్తూ ఉంటారు.

ఈ విధంగా చేయటం వలన శారీరక రుగ్మతలతో పాటు అనేక మానసిక సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఒకే సమయానికి తినకుండా ఎప్పుడు పడితే అప్పుడు తినటం వలన జీవక్రియ రేటులో తేడాలు రావటమే కాకుండా తెలివితేటలు, అధ్యయనశక్తి కూడా తగ్గుతుందట. ముఖ్యంగా అర్ధరాత్రి సమయంలో తినటం వలన జ్ఞాపకశక్తితో పాటు వస్తువుల్ని గుర్తుపట్టే శక్తి సామర్ధ్యాలు తగ్గుతాయట.

జీవగడియారానికి సంబంధించిన సీ.ఆర్.ఈ.బీ అనే ప్రొటీన్ శాతం కూడా తగ్గుతుంది. ఈ ప్రోటీన్ శాతం తగ్గితే అల్జీమర్స్ వస్తుంది. దాని ఫలితంగా అధ్యయనశక్తి, జ్ఞాపకశక్తి రెండూ క్షీణిస్తాయని పరిశోధకులు అంటున్నారు. కావున పెద్దవారైనా….చిన్న పిల్లలైనా సమయ పాలన పాటించి ఆహారం తీసుకుంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."