MoviesTollywood news in telugu

నాపేరు మీనాక్షి సీరియల్ యాక్టర్ మధు రెడ్డి గురించి ఈ నిజాలు తెలుసా?

Naa peru meenakshi serial :టివి సీరియల్స్ కి జనాదరణ బాగానే ఉంది. లాక్ డౌన్ లో గ్యాప్ వచ్చినా, కరోనా కాలంలో కూడా సీరియల్స్ బాగానే ఆకట్టుకుంటున్నాయి. ఈటీవీలో నాపేరు మీనాక్షి సీరియల్ చాలా కాలం నుంచి మంచి ఆదరణతో దూసుకెళ్తోంది. ఇక ఇందులో తన అందంతో , అభినయంతో యాక్టర్ గౌతమి ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. పాజిటివ్, నెగెటివ్ ఏ రోల్ అయినా మెప్పిస్తోంది.

గౌతమి అసలుపేరు మధురెడ్డి. జనవరి 1న తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రిలో జన్మించింది. స్టడీస్ కూడా అక్కడే పూర్తిచేసింది. ఈమెకు ఓ అక్క కూడా ఉంది. చిన్న నాటినుంచి చదువు పెద్దగా ఇష్టం ఉండేది కాదు. పెళ్లి చేసుకుని స్థిరపడాలనుకున్న ఈమె అనుకోకుండా యాక్టర్ అయింది. ఆడదే ఆధారం సీరియల్ లో రేణుకగా ఎంట్రీ ఇచ్చి, తన నటనతో ఆడియన్స్ కి దగ్గరైంది.

ఇదే సీరియల్ లో కలిసి నటించిన కృష్ణ కిషోర్ ని ప్రేమించింది. తర్వాత పెళ్లి చేసుకున్నారు. వీరికి పూర్వి అనే పాప ఉంది. ఆడదే ఆధారం, కుంకుమ పువ్వు, కార్తిక దీపం, జ్యోతి వంటి సీరియల్స్ లో కిషోర్ నెగెటివ్ రోల్స్ చేసాడు. అభిషేకం, కుంకుమ రేఖ, కలల రాజకుమారి, అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు వంటి పలు సీరియల్స్ లో మధురెడ్డి నటించి మెప్పించింది. నాపేరు మీనాక్షితో పాటు జీటీవీలో నాగ భైరవి సీరియల్స్ లో ఈమె నటిస్తోంది. కొన్ని సినిమాల్లో కూడా చేసింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."