నెంబర్ వన్ కోడలు నవ్య గురించి ఈ నిజాలు మీకు తెలుసా?

No 1 kodalu Serial navya : బుల్లితెర సీరియల్స్ కి గల క్రేజ్ మాములుగా లేదు. తదుపరి ఎపిసోడ్ కోసం ఎదురుచూస్తూ… జనాలు సీరియల్స్ ని బాగానే ఆదరిస్తున్నారు. ఇక జి తెలుగు ఛానల్ లో దూసుకుపోతున్న నెంబర్ వన్ కోడలు సీరియల్ లో నటీనటులకు మంచి పేరు కూడా వస్తోంది. టాప్ రేటింగ్ లో నడుస్తున్న ఈ సీరియల్ లో హీరోకి సిస్టర్ గా చేస్తున్న నవ్య తన అందంతో , అభినయంతో ఆకట్టుకుంటోంది.

చూడ్డానికి సమంతలా ఉండే నవ్య అసలు పేరు పద్దుసం. ఈమె జనవరి 30న కాకినాడలో జన్మించింది. ఈమెకు ఓ బ్రదర్ కూడా ఉన్నాడు. చిన్నతనం నుంచి నటనపై ఆసక్తి గల నవ్య స్టడీస్ పూర్తిచేశాక మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. తర్వాత స్టార్ మా లో సిరిసిరి మువ్వ సీరియల్ లో అమర్ దీప్ కి సిస్టర్ గా నటించింది.

ఖాళీగా ఉండే సమయాల్లో వీడియోస్ చేస్తుంది. ఇక ఇంట్లో అందరూ నవ్యను సామ్ అని ముద్దుగా పిలుస్తారు. ఆమె ఫ్రెండ్స్, ఫాన్స్ కూడా ఆమెను జూనియర్ సమంత అని అంటుంటారు. నెంబర్ వన్ కోడలు సీరియల్ ద్వారా తెలుగు ఆడియన్స్ ఆదరణ చూరగొంటోంది.