రవితేజ హీరోయిన్ ని గుర్తు పట్టారా…ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా?
Telugu Actress Tanu Roy :సినిమా పరిశ్రమలో అదృష్టం ఉండాలి. అందం, అభినయం ఉంటేనేకాదు, అదృష్టం ఉంటేనే నిలబడతారు. స్టార్ హోదా వస్తుంది. లేకుంటే కనుమరుగు కావాల్సిందే. ఇలా ఎంతోమంది హీరోయిన్స్ ఛాన్స్ లు లేక ఇండస్ట్రీకి దూరం అవుతున్నారు. మాస్ మహారాజ్ రవితేజ సరసన జోడీకట్టిన తనూరాయ్ కూడా ఇప్పుడు ఛాన్స్ ల కోసం ఎదురుచూస్తోంది.
తాజాగా చిన్ననాటి ఫ్రెండ్ ని పెళ్లి కూడా చేసుకుందని తనూరాయ్ గురించి వినిపిస్తున్నా,ఇంతవరకూ క్లారిటీలేదు. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ నటన పరంగా బాగానే ఆకట్టుకుంది. ఈ మూవీ సూపర్ హిట్ అయింది. అయినా ఎందుకో ఆమె ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేక పోయింది.
శ్రీను వైట్ల డైరెక్షన్ చేసిన ఆనందం మూవీలో కూడా హీరోయిన్ గా చేసిన తనూరాయ్ అందులో కూడా మంచి పేరు తెచ్చుకుంది. ఇక ఆ తరువాత నుంచి గెస్ట్ పాత్రలకే పరిమితం అయిపొయింది. అంతేకాదు, కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో మెరిసింది. నూతన డైరెక్టర్ శంకర్ జి తెరకెక్కించిన ఓ మంజుల కథ మూవీతో ప్రాధాన్యం గల పాత్రలో నటించింది. మళ్ళీ తెలుగులో కన్పించలేదు. ప్రస్తుతం మలయాళం మూవీ ప్రచాయ్ లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.