MoviesTollywood news in telugu

బాహుబలిలో రమ్యకృష్ణను చూసి అసూయ పడ్డ హీరోయిన్…ఎవరో…?

mayuri sudha chandran :నిజ జీవితంలో ఎదురైన సంఘటనల ఆధారంగా సినిమా తెరకెక్కితే అది హిట్ అయితే ఆ ఆనందం మాములుగా ఉండదు. ఒకప్పుడు సుధా చంద్రన్ హీరోయిన్ గా ఇలాగే ఎంట్రీ ఇచ్చి, తొలిమూవీతోనే సూపర్ డూపర్ హిట్ కొట్టేసింది. ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ మీద తీసిన మయూరి మూవీలో నటించి ఎనలేని కీర్తిని సొంతం చేసుకుంది.

తెలుగు, తమిళ, మలయాళ వంటి భాషల్లో 20కి పైగా సినిమాల్లో నటించిన సుధా చంద్రన్ ప్రస్తుతం నెంబర్ వన్ కోడలు సీరియల్ లో చేస్తోంది. బాహుబలి చిత్రంలో రమ్యకృష్ణ పాత్ర చూసాక, అలాంటి పాత్ర తనకు రానందుకు అసూయ పడ్డానని సుధా చంద్రన్ అంటోంది. ఇటీవల అలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొంది. మంగళవారం ప్రసారమైన ఈ కార్యక్రమంలో పలు అంశాలను ఆమె షేర్ చేసుకుంది.

శివగామి పాత్రలో రమ్యకృష్ణ అద్భుతంగా చేసిందని అందుకే అసూయ కలిగిందని సుధా చంద్రన్ చెప్పింది. కేరళలో పుట్టి ముంబైలో పెరిగిన తనకు చిన్నప్పుడు అనుకోకుండా జరిగిన ప్రమాదం, ఆతర్వాత వైద్యుల నిర్లక్ష్యం కారణంగా కాలు కోల్పోవాల్సి వచ్చిందని ఆమె గుర్తుచేసుకుంది. అయితే నాట్యంపై గల మక్కువతో కృత్రిమకాలు అమర్చుకుని 3ఏళ్లపాటు ఎంతో శ్రమించానని చెప్పింది. గతంలో సినిమా ఛాన్స్ లు కష్టంగా ఉండేవని, ఇప్పటివాళ్లకు ఈజీగా వస్తున్నాయని పేర్కొంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."