నోయల్ తో విడాకుల గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన ఎస్తేర్

Noel and Esther Divorce : కన్నడ, కొంకిణి భాషల్లో ఛాన్స్ లు అందిపుచ్చుకుంటున్న నటి ఎస్తేర్ మొదట్లో తెలుగు రానప్పుడు తెలుగులో అవకాశాలు బాగానే తెచ్చుకుంది. అయితే తెలుగు నేర్చుకున్నాక ఛాన్స్ లు తగ్గాయని ఆమె ఇటీవల ఓ ఇంటర్యూలో చెప్పింది. సింగర్గా ఎంట్రీ ఇచ్చి అనుకోకుండా హీరోయిన్ అయింది.

వెయ్యి అబద్ధాలు సినిమాలో హీరోయిన్ గా చేసిన ఎస్తేర్ ఎవరో కాదు ఈ మధ్య బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా పాల్గొన్న నోయల్ కి ఒకప్పుడు భార్య. అవును ఎస్తేర్ తో 2019 జనవరి 3న పెళ్లయింది. ఎన్నాళ్ళో వీళ్ళ కాపురం సాగలేదు. 2020 ఆగస్టులోనే వీళ్ళు విడిపోయారు. విడాకులు కూడా తీసుకున్నారు. ఇక బిగ్ బాస్ నుంచి అనారోగ్య కారణాల వలన నోయల్ ఎలిమినేట్ అయ్యాడు.

ఇటీవల ఇంటర్వ్యూ సందర్బంగా ఎస్తేర్ మాట్లాడుతూ తాను మిస్టేక్ చేయకుండా ఉండివుంటే, తన లైఫ్ లో కూడా మిస్టేక్ కి ఛాన్స్ ఉండేది కాదని పేర్కొంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈమె ప్రస్తుతం షకీలా మూవీలో చేస్తోంది. తను సినీ కుటుంబ నేపధ్యం నుంచి రాలేదని చెప్పింది.

తాను, నోయల్ ఒకరినొకరు ప్రేమించి పెళ్లి చేసుకున్నామని.నోయల్ చాలా మంచి వ్యక్తి అని.కెరీర్ పరంగా ఇద్దరి లక్ష్యాలు వేరు కావడంతో పాటు అభిరుచులు కూడా వేరని అందువల్లే తాను, నోయల్ విడిపోవాల్సి వచ్చిందని చెప్పారు.