ఆన్ని చోట్ల అన్యాయమే అంటున్న అఖిల్… ఎందుకో తెలుసా?
bigg boss akhil :బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్ లో అఖిల్ రన్నరప్ గా నిలిచాడు. అఖిల్ బిగ్ బాస్ కి రాకముందు కొన్ని సీరియల్స్ లో నటించిన పెద్దగా ప్రేక్షకులకు తెలియదు. బిగ్బాస్ నుంచి వచ్చాక వరుస ఇంటర్వ్యూ ఇస్తూ తనకు సంబంధించిన ఎన్నో షాకింగ్ విషయాలు బయట పెట్టాడు. చాలా చిన్న తనం నుండి సెలబ్రిటీ అవ్వాలనే కోరిక ఉండటం అలాగే అందంగా కనిపించాలనే ఉద్దేశంతో కొన్ని చికిత్సలు కూడా చేయించుకున్నాడు.
సినిమాల్లో నటించాలనే కోరికతో ఇంటి నుంచి బయటకు వచ్చాక డబ్బులేక 50,000 అప్పు చేశాడు. సీరియల్స్ లో నటిస్తున్నప్పుడు యాడ్స్ లో నటించే అవకాశం వచ్చిందట. కొందరు మోసం చేయటంతో ఆ అవకాశం తప్పిపోయిందట . ఒక అమ్మాయిని ప్రేమిస్తే కులం కారణంగా బ్రేకప్ అయిందట. ఇలా అన్ని చోట్ల అన్యాయం జరిగిందని చెప్పుకొచ్చాడు న్యూ ఇయర్ పార్టీ సోహెల్ మోనాల్ తో కలిపి చేరుకున్నాడు . బిగ్బాస్ నుంచి వచ్చాక చాలా అవకాశాలు వస్తున్నాయి దానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటిస్తా అని చెప్పుకొచ్చాడు.