డాన్ విలన్ కి ఎన్ని కోట్ల ఆస్థి ఉందో తెలిస్తే షాక్ అవుతారు

Don movie villain kelly dorji :టాలీవుడ్ ప్రముఖ డాన్స్ కొరియో గ్రాఫర్, దర్శకుడు రాఘవ లారెన్స్ తెరకెక్కించిన “డాన్” చిత్రంలో విలన్ గా నటించి ఆడియన్స్ ని ఆకట్టుకున్న ప్రముఖ విలన్ “కెల్లీ డోర్జీ” నిజానికి నాగ్ తో సహా సమానంగా సినీ విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకున్నాడు. తర్వాత తెలుగులో వరుస ఛాన్స్ లు దక్కించుకుని రాణించాడు. అయితే ఈ మధ్య కాలంలో కెల్లీ డోర్జీ సినిమాల పరంగా కొంతమేర జోరు తగ్గించినట్లు తెలుస్తోంది.

తెలుగులో చివరగా ప్రముఖ దర్శకుడు చిన్నికృష్ణ దర్శకత్వం వహించిన “బ్రదర్ అఫ్ బొమ్మాలి” అనే చిత్రంలో విలన్ గా కనిపించాడు. ఆ తర్వాత మళ్ళి ఇప్పటివరకు తెలుగు సినిమాలలో నటించలేదు. ఆ మధ్య ఓ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తో ప్రేమాయణం నడిపాడు. అయితే వివిధ కారణాల వల్ల పెళ్లి చేసుకోలేకపోయాడు. భూటాన్ దేశంలో పుట్టి పెరిగిన కెల్లీ డోర్జీ తండ్రి భూటాన్ దేశ ప్రభుత్వ సంస్థలో ఉద్యోగిగా పని చేసేవాడు.

చిన్నప్పటినుంచి కెల్లీ డోర్జీ కి నటనపై ఆసక్తితో పాఠశాల, కాలేజీలలో జరిగే నాటకాలలో పాల్గొనేవాడు. కాలేజీ స్టడీస్ అయ్యాక మోడలింగ్ కోర్సు చదివి కొంత కాలం పాటు అదే రంగంలో పని చేశాడు. 2004వ సంవత్సరంలో తెలిసిన వారి ద్వారా ఓ బాలీవుడ్ చిత్రంలో నటించే ఛాన్స్ కొట్టేసాడు. ఇతడికి భూటాన్ దేశంలో “టేర్టన్ ట్రావెల్ బూటాన్” అనే టూరిస్ట్ కంపెనీ ఉంది. ఈ సంస్థ ద్వారా ఇతడికి ఒక ఏడాదిలో తను నటించిన మూవీస్ వాళ్ళ ఆదాయం కంటే ఎక్కువ వస్తుంది. అయినాసరే నటనపై ఆసక్తి వలన మూవీస్ పై ఫోకస్ పెట్టేసాడు.