సంక్రాంతి రోజు ఏ రాశివారు ఏ దానం చేస్తే మంచిదో తెలుసా?

Makar Sankranti 2021 : హిందువులకు మకర సంక్రాంతి చాలా ప్రత్యేకమైనది.సంక్రాంతి సమయంలో సూర్యుడు ధనస్సు రాశి నుండి మకరంలోకి ప్రవేశిస్తాడు. ఈ రోజు ఏ రాశివారు ఏ వస్తువులను దానం చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో వివరంగా తెలుసుకుందాం.

మేష రాశివారు నువ్వులను దానం చేస్తే కోరుకున్న కోరికలు నెరవేరతాయి.
వృషబా రాశివారు నువ్వులు,పేదవారికి బట్టలను పంచిపెడితే శుభం కలుగుతుంది.
మిధునరాశి వారు గొడుగులను దానం చేయాలి.
కర్కాటక రాశివారు పేదవారికి బట్టలను దానం చేయాలి.
సింహా రాశివారు పేదవారికి దుప్పట్లు పంచిపెట్టాలి.
కన్య రాశివారు ఉద్ది పపు,నూనె దానం ఇవ్వాలి.
తుల రాశివారు పేదవారికి కాటన్ దుస్తులను పంచిపెట్టాలి.
వృశ్చిక రాశివారు దుప్పట్లు పంచిపెట్టాలి.
ధనస్సు రాశివారు కొన్ని రకాల ధాన్యాలను పంచిపెట్టాలి.
మకర రాశివారు పుస్తకాలను పంచిపెడితే కోరుకున్న కోరికలు నెరవేరతాయి.
కుంభ రాశివారు సబ్బులు, బట్టలు, దువ్వెనలతో సహా ఆహారాన్నిపంచిపెడితే శుభం కలుగుతుంది.
మీన రాశివారు కాటన్ దుప్పట్లు పంచిపెట్టాలి.