MoviesTollywood news in telugu

ఈ నటున్ని గుర్తు పట్టారా…ఇప్పుడు ఏమి చేస్తున్నారో తెలుసా?

Costumes Krishna Unknown facts : అన్ని రంగాల్లో మోసాలు ఉంటాయి. చాలామంది మోసపోతుంటారు. ఇక సినిమా రంగంలో కూగా హేమాహేమీలే మోసపోయారు. ఒకప్పుడు కాస్ట్యూమ్స్ డిజైనర్ గా ప్రసిద్ధి చెంది సినిమా నటుడిగా మారిన ఎం కృష్ణ 1954లో మద్రాసు వెళ్లి సినిమా వాళ్ళ దగ్గర అసిస్టెంట్ కాస్ట్యూమర్ గా చేరాడు. తక్కువ సమయంలో ఎక్కువ పేరు తెచ్చుకుని డాక్టర్ డి రామానాయుడు దగ్గర ఫుల్ టైం కాస్ట్యూమ్ డిజైనర్ గా చేసారు.

ఎన్టీఆర్, అక్కినేని, కృష్ణ, శోభన్ బాబు, జయసుధ, జయప్రద, శ్రీదేవి ఇలా ఎందరో స్టార్స్ కి బట్టలు కుట్టారు. బల్ బాటమ్ నుంచి, నారో వరకూ హీరోల ట్రెండ్ కి తగ్గట్టు కాస్ట్యూమ్స్ డిజైన్ చేసారు. తెల్లవారుఝాము నాలుగు గంటల నుంచి రాత్రి 12గంటల వరకూ కష్టపడేవారు. ఫ్యామిలీతో గడిపే సమయం కూడా ఉండేది కాదట. అయితే ఇతడిలో ఏదో టాలెంట్ ఉందని గ్రహించిన డైరెక్టర్ కోడి రామకృష్ణ పట్టుబట్టి మరీ భారత్ బంద్ మూవీలో విలన్ వేషం కట్టించారు.

అలా నటుడుగా ఎంట్రీ ఇచ్చిన కాస్ట్యూమ్స్ కృష్ణ తొలిసినిమాతోనే హిట్ అందుకున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ నటించిన అశ్వథామ మూవీలో కూడా చేసి, హిట్ అందుకోవడంతో కోడి రామకృష్ణ డైరెక్షన్ లో పెళ్ళాం చెబితే వినాలి, పుట్టింటికి రా చెల్లి , పెళ్లిపందిరి వంటి హిట్ మూవీస్ లో చేసి మంచి పేరు తెచ్చుకున్న కాస్ట్యూమ్స్ కృష్ణ నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యాడు. అయితే అన్నీ బానే ఉన్నాయిఅని అనుకుంటున్న సమయంలో పెళ్లిపందిరి మూవీకి ప్రచారం కోసం రెండు లక్షలు పెట్టమంటే అక్కర్లేదన్నారు. అయితే ఆ డబ్బు అప్పుగా ఇస్తాం సంతకం పెట్టమని అడిగితె పెట్టేసారు. కానీ ఒకదాంట్లో అప్పుగా, మరోదాంట్లో నెగెటివ్ రైట్స్ కొన్నట్లు రాసి ఉందట. ఆ మోశాన్ని తట్టుకోలేక సినిమాలకు దూరమై సామాన్య జీవనం సాగిస్తున్నారు.