MoviesTollywood news in telugu

కేజీఎఫ్ విలన్ గరుడ గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే

Kgf garuda Facts :పేరుకి కన్నడ మూవీ అయినా కోలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని భాషల్లో కెజిఎఫ్ మూవీ సెన్షేషన్ అయింది. హీరో యష్ భారీ క్రేజ్ తెచ్చుకోగా, బయ్యర్లకు కనకవర్షం కురిసింది.250కోట్లు కలెక్ట్ చేసింది. హిందీలో కూడా అత్యధిక వసూళ్లు రాబట్టిన కన్నడ మూవీగా నిల్చింది.

ఆదిత్యనాధ్ తో పాటు విలన్ గా చేసిన రామ్ కు ఎనలేని క్రేజ్ తెచ్చిపెట్టిన ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ కూడా వస్తోంది. గరుడ పాత్రకు రామ్ ప్రాణం పోసాడు. నిజానికి హీరో యష్ కి రామ్ బాడీగార్డ్. కెజిఎఫ్ లో రామ్ ని తీసుకోవడంలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఎందుకు ఆలోచించాడో కానీ అతడి కెరీర్ మారిపోయింది.

మొదట్లో కెజిఎఫ్ స్టోరీ చెప్పేటప్పుడు అక్కడే రామ్ ఉండడంతో గరుడ పాత్రకు రామ్ ను సెలెక్ట్ చేయాలన్న కోరిక ప్రశాంత్ నీల్ చెప్పగా యష్ వెంటనే ఒకే చెప్పాడు. దీంతో ఆడిషన్స్, క్యారెక్టర్ ఇవ్వడం అన్నీ చకచకా జరిగాయి. అలా యష్ తో కల్సి నటించాలన్న కోరిక నెరవేరింది. పైగా పవర్ ఫుల్ కావడంతో రామ్ కి మంచి పేరు వచ్చింది దీంతో తెలుగు, కన్నడ, తమిళ సినిమాల్లో నాలుగు సినిమాల్లో ఛాన్స్ రావడంతో రామ్ ఒకే చెప్పేశాడట.