రోజా మాట వినని ఈ కమెడియన్ పరిస్థితి ఎలా ఉందో తెలుసా?

Jabardasth Roja :జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది కామెడియన్స్ కి లైఫ్ వచ్చింది. సినిమా అవకాశాలను అంది పుచ్చుకుంటూ ఈవెంట్స్ చేసుకుంటూ సెలబ్రిటీలుగా మారిపోయారు. అలా జబర్దస్త్ కామెడియన్స్ సెలబ్రిటీ హోదా తెచ్చిపెట్టింది. జబర్దస్త్ లో తనదైన ముద్రతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న చమక్ చంద్ర ఎంత మంది కామెడియన్స్ వచ్చిన తన క్రేజ్ తగ్గకుండా చూసుకున్నాడు.

అయితే నాగబాబు జబర్ధస్త్‌ను వీడి అదిరిందికి వెళ్లిపోవడంతో… ఆయన దారిలోనే ఆయనను నమ్ముకుని అక్కడికి వెళ్లిపోయాడు చంద్ర. అక్కడ కూడా చంద్ర హవా కొనసాగింది. కార్యక్రమం మారినా… చంద్ర స్కిట్స్ ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాయి. అయితే ఆ కార్యక్రమం ఆగిపోవటంతో చంద్ర పరిస్థితి ఏమిటి అనే దాని మీద చర్చ సాగుతుంది.

జబర్దస్త్ కి తిరిగి వస్తాడని టాక్ నడుస్తుంది. అయితే వారాలు గడుస్తున్న చమ్మక్ చంద్ర జబర్ధస్త్‌కు వచ్చే సంకేతాలు మాత్రం ఎక్కడ కనపడటం లేదు. బుల్లితెరపై కనిపించే విషయంలో చమ్మక్ చంద్ర ఆలస్యం చేస్తే ఇబ్బందుల్లో పడాల్సి వస్తుంది. జబర్దస్త్ నుండి బయటకు వెళ్ళే సమయంలో రోజా వద్దని చెప్పిన వినలేదట. కొంత మంది కామెడియన్స్ రోజా మాట విని జబర్దస్త్ లో ఉండిపోయారు.