క్రాక్ మూవీలో కుర్రాడి బ్యాగ్రౌండ్ ఏమిటో…తండ్రి ఎవరో తెలుసా?

krack movie child artist :గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో రవితేజ హీరోగా నటించిన క్రాక్ మూవీ ఈ సంక్రాంతికి రిలీజై హిట్ టాక్ తెచ్చుకుంది. శృతిహాసన్ హీరోయిన్ గా చేసింది. జనవరి 9న రిలీజైన ఈమూవీ మంచి కలెక్షన్స్ తెస్తోంది. నిజానికి వీరి కాంబినేషన్ లో డాన్ శీను వచ్చి తొలిసినిమాతోనే హిట్ కాంబినేషన్ గా ముద్రపడింది. ఆతర్వాత విక్టరీ వెంకటేష్ తో బాడీగార్డ్ మూవీ తీసి హిట్ కొట్టిన గోపీచంద్ మలినేని ఆతర్వాత రవితేజతో బలుపు మూవీ తీసి హిట్ అందుకున్నాడు. పవర్, బెంగాల్ టైగర్ తర్వాత వరుస ప్లాప్ లతో సతమతమవుతున్న రవితేజ హిట్ కోసం ఎంతగానో పరితపిస్తున్నాడు.

సరిగ్గా ఇదే సమయంలో లాక్ డౌన్ తర్వాత వచ్చిన క్రాక్ మూవీ రవితేజ కు హిట్ ఇచ్చింది. ఈ మూవీలో రవితేజ పోలీసాఫీసర్ గా , వరలక్ష్మి శరత్ కుమార్, సముద్రఖని కీలక పాత్రలను పోషించారు. తమన్ మ్యూజిక్ బాగా ఆకట్టుకుంది. లాక్ డౌన్ తో మూతపడి, నిబంధనల సడలింపు తెరుచుకున్న థియేటర్లలో కలెక్షన్స్ పరంగా క్రాక్ మంచి ట్రాక్ రికార్డ్ తెచ్చింది. ఇక ఈ మూవీలో కుర్రాడుగా నటించిన వ్యక్తి ఎవరో కాదు డైరెక్టర్ గోపీచంద్ మలినేని కొడుకే. సినిమా పరిశ్రమలో చాలామంది డైరెక్టర్స్ పిల్లలు చిన్నప్పటి నుంచి నటిస్తూ, పెద్దయ్యాక కూడా హీరోలుగా రాణిస్తున్నవాళ్ళు చాలామంది ఉన్నారు.

రవిరాజా పినిశెట్టి తనయుడు ఆది పినిశెట్టి, దాసరి కొడుకు అరుణ కుమార్, కోదండరామిరెడ్డి కొడుకు వైభవ్ రెడ్డి, ఈవీవీ తనయులు ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్ ఇలా చాలామంది ఇండస్ట్రీలో తమదైన శైలిలో నటిస్తూ అలరిస్తున్నారు. అయితే ఇందులో బాల నటులుగా నటించినవాళ్లు అరుదు. తమిళ డైరెక్టర్ టి రాజేందర్ కొడుకు శింబు బాలనటుడిగా చేసి, ఇప్పుడు హీరోగా అదరగొడుతున్నాడు. హీరో సాయికుమార్ కొడుకు కూడా చిన్నప్పుడు బాలనటుడిగా చేయగా, బోయపాటి శ్రీను కూతురు లెజెండ్ సినిమాలో బాలయ్యను మావయ్య అని పిలిచే సీన్ లో చేసింది. ఇప్పుడు గోపీచంద్ మలినేని కొడుకు నటించాడు. మాటలతో, సెటైర్లతో నవ్విస్తూ ఓ ఫైట్ కూడా చేసాడు. కొడుక్కి తొలిసినిమాతో హిట్ అందించాడు.