MoviesTollywood news in telugu

సింగర్ సునీత మొదటి భర్త గురించి ఈ నిజాలు మీకు తెలుసా…వెంటనే చూసేయండి

Singer Sunitha 1st Husband: సింగర్ సునీత రెండో పెళ్లి చేసుకున్నప్పటి నుండి సోషల్ మీడియాలో సునీత గురించి ఏ వార్త వచ్చిన వైరల్ అవుతుంది. సునీత తన మనస్సుకు నచ్చిన రామ్ వీరపనేనితో జనవరి 9 న ఏడడుగులు వేసింది. సునీత పెళ్ళికి చాలా మండి సెలబ్రేటీస్ హాజరు అయ్యారు. ఈ పెళ్ళిలో సుమ తన స్నేహితురాలికి ఖరీదైన బహుమతి ఇచ్చింది.

ఇక అసలు విషయంలోకి వస్తే…సునీత మొదటి భర్త గురించి పెద్దగా ఎవరికి తెలియదు. సునీత మొదటి పెళ్లి కూడా సినిమా స్టైల్ లోనే జరిగింది. అది కూడా కేవలం 19 ఏళ్ళ వయసులోనే ప్రేమించి ఇంట్లో వారిని ఎదిరించి మరీ పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత పెద్దవారు ఒప్పుకొని ఆశీర్వదించారు.

ఈమె మొదటి భర్త పేరు కిరణ్. ఆయన కూడా ఇండస్ట్రీలోనే ఉన్నాడు. సునీత గాయనిగా పరిచయం అయిన తర్వాత ఆమెకు ఇక్కడ కూడా చాలా మంది అభిమానులు వచ్చారు. ఇదిలా ఉంటే ఈమెకు 17 ఏళ్ళున్నపుడే కిరణ్ ఐ లవ్ యూ చెప్పాడు. అయితే వెంటనే ఆమె ఒప్పుకోలేదు. దాదాపు ఏడాదిన్నర తిరిగిన తర్వాత ఓకే చెప్పింది. కానీ అప్పటికి కూడా ఆమె వయసు కేవలం 19 ఏళ్ళు మాత్రమే. ఆ తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టాక అనుకోని కొన్ని అభిప్రాయ బేధాల కారణంగా విడిపోయారు. అప్పటి నుంచి సునీత పిల్లలే లోకంగా పెరిగారు.