ముగ్గురు హీరోయిన్స్ తో రొమాన్స్ చేస్తున్న హీరోలు

Tollywood Stars :సాధారణంగా హీరో అనగానే ఒక హీరోయిన్ ఉంటుంది. కానీ హీరో డబుల్, త్రిబుల్ రోల్స్ వేస్తె, అందుకు తగ్గట్టు హీరోయిన్స్ ఉండడం సహజం. కానీ హీరో ఒక్కడే కానీ ముగ్గురు హీరోయిన్స్ తో రొమాన్స్ చేయడం మాటలు కాదు. అందుకు తగ్గ కథ అల్లుకోవాలి. బడ్జెట్ చూసుకోవాలి. అయితే అలా చేస్తున్నవాళ్లు ఉన్నారు. అయితే కొత్తగా వచ్చే సినిమాలు కూడా అలా ముగ్గురు హీరోయిన్స్ ఉంటున్నారు. సీనియర్ హీరో బాలకృష్ణ ఇప్పటికే ‘సమరసింహారెడ్డి’, ‘నరసింహ నాయుడు’ లో ముచ్చటగా ముగ్గురు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేసాడు. తాజాగా దర్శకుడు బోయపాటితో నటిస్తున్న మూవీలో కూడా ముగ్గురు హీరోయిన్స్ ని తీసుకున్నారని టాక్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అప్పట్లో జల్సా సినిమాలో కూడా ముగ్గురు హీరోయిన్లతో నటించారు. మళ్ళీ ఇప్పుడు ‘వకీల్ సాబ్’ లో స్టోరీ డిమాండ్ ‌ను బట్టి అంజలి, నివేధా థామస్‌తో పాటు, శృతి హాసన్ కూడా నటిస్తున్నారు. పవర్‌స్టార్ భార్య పాత్రలో శృతి హాసన్ నటిస్తోంది. ఇక మన్మధుడు నాగార్జున సైతం తదుపరి మూవీ ‘బంగార్రాజు’ లో కూడా ముగ్గురు హీరోయిన్స్ తో నటించబోతున్నాడట.

కాగా,ఈ సంక్రాంతికి ‘క్రాక్’ సినిమాతో హిట్ అందుకున్న మాస్ మహారాజా రవితేజ తదుపరి మూవీ ‘ఖిలాడి’ లో ముచ్చటగా ముగ్గరు భామలతో జోడీ కట్టబోతు న్నాడు. రమేష్ వర్మ డైరెక్షన్ చేసే ఈ మూవీలో మీనాక్షీ చౌదరి, డింపుల్ హయతీని హీరోయిన్స్‌గా ఫిక్స్ చేశారు. మరో హీరోయిన్‌గా హాట్ యాంకర్ అనసూయ నటించ బోతున్నట్టు టాక్. నాని – శివ కాంబోలో ‘ శ్యామ్ సింగరాయ్’ సినిమా కోసం ముగ్గురు హీరోయిన్లను తీసుకోబోతున్నారు. ఇప్పటికే ‘ఉప్పెన’ ఫేమ్ కృతి శెట్టి ఒకే అయింది. మెయిన్ లీడ్ రోల్‌లో సాయి పల్లవి, మరో గెస్ట్ హీరోయిన్ గా నివేధా పేతురాజ్, అదితీ రావ్ హైదరీలను పరిశీలిస్తున్నారట.