ప్రదీప్ నెల సంపాదన ఎన్ని లక్షలో తెలిస్తే షాక్ అవ్వాలసిందే

Pradeep Machiraju : బుల్లితెరపై టాప్ యాంకర్ అనగానే సుమ కనకాల పేరే గుర్తుకు వస్తుంది. అదే ఫీమేల్ యాంకర్స్ కాకుండా మేల్‌లో అయితే మొదట ప్రదీప్ మాచిరాజు పేరు గుర్తుకు వస్తుంది. ఒక పక్క యాంకరింగ్ చేస్తూనే మరో పక్క ప్రొడక్షన్ హౌస్ స్థాపించి బుల్లితెరపై కార్యక్రమాలు రూపొందిస్తున్నాడు. ఇక 30 రోజుల్లో ప్రేమించటం ఎలా అనే సినిమాతో హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా కరోనా కారణంగా విడుదలలో ఆలస్యం అయింది.

ఈ నెల 29 న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా కి ప్రదీప్ పారితోషికంగా 25 లక్షలు తీసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ప్రదీప్ నెల సంపాదన దాదాపుగా 40 లక్షల వరకు ఉంటుందని సమాచారం. ఈయన ఒక్కో ఎపిసోడ్ కోసం 1.25 లక్షలకు పైగానే తీసుకుంటున్నాడని ప్రచారం జరుగుతుంది. రెండేళ్ల కింద ఎపిసోడ్‌కు 75 వేల వరకు తీసుకున్న ప్రదీప్ ఇఫ్పుడు తన పారితోషికం మరో 50 వేలు పెంచేసాడు.