కృష్ణ తులసి సీరియల్ హీరోయిన్ రియల్ లైఫ్ లో ఎలా ఉందో చూడండి

krishna tulasi serial : త్వరలో జి తెలుగులో ధారావాహికంగా కృష్ణ తులసి సీరియల్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ సీరియల్ కి సంబంధించి రెండు ప్రోమోస్ జిటివి యాజమాన్యం రిలీజ్ చేసింది. ఈ ప్రోమో చూస్తే, ఇద్దరు హీరోయిన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. పైగా వాళ్లిద్దరూ అక్కాచెల్లెళ్లుగా కనిపిస్తున్నారు. అయితే ఒకరు నల్లగా, మరొకరు తెల్లగా ఉన్నారు.

ఒకామె స్టేజ్ వెనుక ఉండి సాంగ్ పాడుతుంటే, మరొకరు స్టేజి మీద ఉండి సాంగ్ పడుతున్నట్లు నటిస్తోంది. ఎన్నో కమర్షియల్ హిట్ మూవీస్ తీసిన దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు డైరెక్షన్ లో ఈ సీరియల్ రూపుదిద్దుకుంది. ఇక స్టేజ్ వెనుక పాడుతున్న వ్యక్తి గురించి ఆసక్తికర విషయాలను తెలుసుకోవాలంటే, ఆమె చాలా సీరియల్స్ లో చేస్తోంది.

ఈమె పేరు ఐశ్వర్య. చిన్నప్పటి నుంచి ఎంతో ఆసక్తి ఉండడంతో మోడలింగ్ లోకి అడుగుపెట్టింది. కొన్ని ఫ్యాషన్ షోస్ లో రాంప్ వాక్ మొదలైంది. ఇక బెంగుళూరులోని యాక్టింగ్ స్కూల్ లో చేరి, కన్నడ రాకపోవడం వలన ఎక్కువ మాట్లాడేది కాదట. నటన నేర్చుకోవడం ద్వారా స్టేజి ఫియర్ కూడా పోగొట్టుకుంది. ఈమెకు హార్స్ రైడింగ్ ఇష్టమట. 2020లో రిలీజైన ఓ కన్నడ షాట్ ఫిలిం లో నటించింది. ఐషు ఐ లవ్ యు అనే ఈ షో బాగా పాపులార్టీ అయింది. తర్వాత కన్నడ సీరియల్ లో లీడ్ రోల్ చేసింది. ఉదయ్ టివిలో ప్రసారం అవుతోంది.