కల్యాణ వైభోగం సీరియల్ లో మేఘనకు డబ్బింగ్ చెప్పింది ఎవరో …?
kalyana vaibhogam Serial :బుల్లితెర ఆడియన్స్ కి సీరియల్స్ మంచి కాలక్షేపాన్ని ఇస్తున్నాయి. అందుకే పలు ఛానల్స్ లో రోజు రోజుకి సీరియల్స్ పెరిగిపోతూనే ఉన్నాయి. ఇక కల్యాణ వైభోగం సీరియల్ చూసిన వెంటనే సన్నీ, మేఘన జంట కనిపిస్తుంది. ఇందులో మేఘన లోకేష్ అటు నెగేటివ్ , ఇటు పాజిటివ్ పాత్రలతో దూసుకెళ్తోంది.
మంగ, నిత్య పాత్రల్లో ఇమిడిపోతూ, పాజిటివ్, నెగెటివ్ పాత్రలను బ్యాలెన్స్ చేస్తూ, ఓ మంచి నటిగా తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మేఘన ఇలా నటనకే పరిమితం కాకుండా తన వాయిస్ కి కూడా ఓ ప్రత్యేకతను సంతరించుకుంది.
మేఘన లోకేష్ కి కల్యాణ వైభోగం సీరియల్ లో మంచి వాయిస్ ని అందిస్తున్న వ్యక్తి ఎవరు అనుకుంటున్నారా, ఇంకెవరు చక్రం జయ. చాలా సీరియల్స్ లో ఈమె డబ్బింగ్ ఇస్తోంది. తాజాగా ఈ సీరియల్ లో నటనకు జి కుటుంబం అవార్డుల్లో ఉత్తమ నటి అవార్డు ను మేఘన లోకేష్ సాధించింది. ఈమె నటనకు ఎంతటి ప్రాధ్యాన్యం ఉందో తెరవెనుక జయ డబ్బింగ్ కి అంతే ఇంపార్టెన్స్ ఉంది.