స్టార్ హీరో కొడుకును గుర్తు పట్టారా…ఎంత ముద్దు వస్తున్నాడో…
Ajith Son Aadvik :ఎవరైనా తన కొడుకు తనను మించిన వాడవ్వాలని అనుకుంటాడు. కొందరి విషయంలో నిజం అవుతుంది. ఇక ప్రముఖ దక్షిణాది నటుడు అజిత్ కుమార్ కి గల ఫాలోయింగ్ మామూలు రేంజ్ లో ఉండదు. కానీ అజిత్ కన్నా అతడి కొడుకు అద్విక్ వీర లెవెల్లో ఫాలోయింగ్ ఉంది. అజిత్ తన కొడుకు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటాడు. దీంతో అద్విత్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడం కామన్ అయింది.
అజిత్ ప్రస్తుతం హెచ్. వినోద్ దర్శకత్వంలో వస్తున్న ‘వలిమై‘ మూవీలో చేస్తుండగా, నీరవ్ షా సినిమాటోగ్రఫీ చేస్తున్నాడు. ఈ మూవీలో కార్తికేయ గుమ్మకొండ, హ్యుమా ఖురేషి, యోగి బాబు నటిస్తున్నారు. తమిళంలో మంచి హీరోగా గుర్తింపు పొందాడు. మొదటిసారి 1992లో ప్రేమ పుస్తకం అనే తెలుగు మూవీలో అజిత్ నటించగా, తెలుగు,తమిళం, కన్నడం, మలయాళం, ఆంగ్లం భాషలో అజిత్ మాట్లాడ్డం లో దిట్ట.
కాగా2000 సంవత్సరంలో ఒకప్పటి టాప్ హీరోయిన్ షాలిని ను పెళ్లి చేసుకున్న అజిత్ భార్య, కొడుకు ఇటీవల ఓ కార్యక్రమంలో కనబడగా ప్రస్తుతం అది వైరల్ గా మారింది. అలాగే అద్విక్ తన తల్లి షాలిని తో పాటు మరో నటి షామిలి కలసి ఓ పెళ్లి వేడుకలలో సందడి చేసారు. షాలిని, షామిలి చైల్డ్ ఆర్టిస్టులుగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ప్రస్తుతం అందరూ ఒకేచోట ఉండగా శాలిని సిస్టర్ తో పాటు కుట్టి థలా వెరీ క్యూట్ అంటూ అజిత్ కొడుకును తన అందంతో పొగుడు తోంది. కొడుకు, షాలిని సిస్టర్స్ పిక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.