బిగ్ బాస్ సీజన్ 5 తొలి కంటెస్టెంట్ ఎవరో తెలుసా?
Bigg Boss 5 :బుల్లితెరలో బిగ్ బాస్ రియాల్టీ షో ఎంతటి ఘన విజయం సాధించిందో మనకు తెలిసిందే బిగ్ బాస్ సీజన్ 4 ముగిసి రెండు నెలలు కూడా పూర్తి కాలేదు అప్పుడే సీజన్ 5 గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. బిగ్బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ ల ఎంపిక ప్రక్రియ ప్రారంభం అయిందని వార్తలు వస్తున్నాయి. తొలి కంటెస్టెంట్ సాఫ్ట్ వేర్ డెవలపర్ వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకులను మెప్పించిన షణ్ముఖ్ జశ్వంత్ అని వార్తలు వస్తున్నాయి.
యూత్ లో మంచి క్రేజ్ ఉన్న షణ్ముఖ్ జశ్వంత్ బిగ్ బాస్ సీజన్ 5 కి వెళ్ళితే మాత్రం అంచనాలు భారీగానే పెరుగుతాయి. ఈ విషయంలో ఎంత నిజం ఉందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగవలసిందే. షణ్ముఖ్ కు యూట్యూబ్ లో 26 లక్షల మంది ఫాలోవర్లు ఉండగా ఇన్స్ట్రాగ్రామ్ లో 10 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.
షణ్ముఖ్ బిగ్ బాస్ ఆఫర్ కి ఒకే చెప్పాడనే వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. అంతేకాకుండా ఇప్పటికే రవి, హైపర్ ఆదిల పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
