Beauty Tips

ముఖంపై ముడతలను పోగొట్టే క్యాబేజీ…ఎలాగో తెలుసా?

cabbage skin benefits :మారిన జీవనశైలి పరిస్థితులు,కాలుష్యం,ఆహారపు అలవాట్లు, పెరుగుతున్న వయస్సు వంటి కారణాలతో ముఖం మీద ముడతలు ఏర్పడతాయి. ఈ మధ్య కాలంలో చాలా చిన్న వయస్సులోనే అంటే 25 సంవత్సరాలు వచ్చేసరికి ముఖం మీద ముడతలు వచ్చేసి ముసలివారుగా కనపడుతున్నారు. ముడతలు రాగానే చాలా కంగారూ పడిపోయి మార్కెట్ లో దొరికే అనేక రకాల క్రీమ్ లు వాడుతూ ఉంటారు. ఖర్చు కూడా భారీగానే పెట్టేస్తారు. అయిన ఫలితం మాత్రం తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది.

అదే ఇంటి చిట్కాలను ఫాలో అయితే శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. ముడతలను తగ్గించటంలో క్యాబేజీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీని కోసం క్యాబేజీని శుభ్రంగా కడిగి రసం తీసుకోవాలి. ఒక స్పూన్ క్యాబేజీ రసంలో ఒక స్పూన్ తేనె కలిపి ముఖానికి రాసి రెండు నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి అరగంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే క్రమంగా ముడతలు మాయం అవుతాయి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."