బంపర్ ఆఫర్ కొట్టేసిన మోనాల్…అదృష్టం అంటే మోనాల్ దే…?
Bigg Boss Monal :బిగ్ బాస్ లో చేస్తే ఛాన్స్ లు రావని అంటారే గానే ఈ అమ్మడుకి ఛాన్స్ లు బాగానే వస్తున్నాయని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే, ‘అల్లుడు అదుర్స్’ మూవీలో స్పెషల్ సాంగ్‌లో సందడి చేసిన ‘బిగ్‌బాస్’ ఫేమ్ మోనాల్ గజ్జర్ కి హిందీలో నటించిన కాగజ్ చిత్రం కూడా ఆమెకు మంచిపేరు తెచ్చిపెట్టింది. ఇప్పుడు మరో సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడానికి ఒకే చెప్పిందట. మహేశ్‌బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సర్కారువారి పాట’ సినిమా చిత్రీకరణ దుబాయ్‌లో జరుగుతోంది.
గీతా గోవిందం సినిమా తరువాత పరశురామ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. మహానటి ఫేమ్ కీర్తీ సురేశ్ హీరోయిన్ గా చేస్తున్న ‘సర్కారు వారి పాట’ 2022 సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉందట. ఈ పాటలో మోనాల్‌తో స్టెప్స్ వేయించాలని చిత్రబృందం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
బిగ్ బాస్ సీజన్ 4 లో 14 వారాలు హౌస్ లు ఉన్న మోనాల్ గజ్జర్ కు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి గుర్తింపు వచ్చింది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక అల్లుడు అదుర్స్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. ఇక స్టార్ మా ఛానెల్ లో ప్రసారమవుతున్న డాన్స్ ప్లస్ షోకు మోనాల్ జడ్జిగా వ్యవహరిస్తోంది. మహేష్ మూవీలో ఛాన్స్ దక్కితే గుజరాతీ భామ మోనాల్ ఇక వెనక్కి తిరిగి చూడక్కర్లేదని అంటున్నారు.