విజయ్ సేతుపతి గురించి ఈ నమ్మలేని నిజాలు మీకు తెలుసా?
vijay sethupathi Facts :విజయ్ సేతుపతి .. ప్రస్తుతం ఈ పేరు తెలుగు, తమిళ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తోంది. ఎవరికైనా టైం వస్తే, ఇలాగే ఉంటుంది. అందుకే యితడు హీరోగా చేస్తూనే , మరోవైపు నెగెటివ్ రోల్స్ లో చేస్తూ మెప్పిస్తున్నాడు. పాత్ర ఏదైనా మెప్పించడం విజయ్ సేతుపతి ప్రత్యేకత. అందుకు తార్కాణమా 96 సినిమాలో సున్నిత ప్రేమికుడిగా నటించి , ఆడియన్స్ మనసు దోచుకున్న విజయ్ సేతుపతి, మాస్టర్ సినిమాలో భయంకరమైన విలనిజం పండించాడు. తమిళనాడులోని రాజ పాల్యెం కి చెందిన విజయ్ సేతుపతి, సినిమా సినిమాకు సక్సెస్ సాధిస్తూ, ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెంచుకుంటున్నాడు.
కామర్స్ లో డిగ్రీ చదివి, ఆ తరువాత సేల్స్ మ్యాన్ గా, క్యాషియర్ గా చిన్నచిన్న ఉద్యోగాలు చేసిన విజయ్ 16ఏళ్ల వయస్సులో సినిమా అడిషన్ లో పాల్గొని ఛాన్స్ దక్కకపోవడంతో సినిమాలకు దూరంగా జరిగాడు. పాకెట్ మనీ కోసం చిన్న ఉద్యోగాలు చేసిన విజయ్ దుబాయ్ కు వెళ్లి మూడేళ్లు ఒక కంపెనీలో పని చేశాడు. 2003లో దుబాయ్ నుంచి భారత్ కు వచ్చిన విజయ్ ఇంటీరియర్ డిజైనింగ్ సంస్థ పెట్టాడు. ఓ మార్కెట్ సంస్థలో ఉద్యోగం చేసాడు. ఎన్ని చేసినా సంతృప్తిలేదు.
దీంతో ఒక నాటక సంస్థలో అకౌంటెంట్ గా చేరి, అక్కడ నటనలో మెలుకువలు నేర్చుకున్న విజయ్ సేతుపతి తనను తాను మార్కెటింగ్ లో ప్రమోట్ చేసుకోవడం స్టార్ట్ చేసాడు. మొదట్లో చిన్న పాత్రలు చేసిన విజయ్ ఎక్కువగా ప్రయోగాలు చేస్తూ ప్రస్తుతం స్టార్ రేంజ్ కి ఎదిగాడు. పాటలు రాయడం, పాడటం హాబీలు. ఇక వంట కూడా బాగా చేస్తాడని, ముఖ్యంగా బిర్యానీ అద్భుతంగా చేస్తాడని తెలుస్తోంది. విజయ్ సేతుపతి భార్య పేరు జెస్సీ. వీళ్లకు ఓ కొడుకు, ఒక పాప ఉన్నారు. ఒక్కో సినిమాలో ఒక్కో విభిన్న పాత్రలో నటిస్తూ, తన నటనతో అభిమానులను సొంతం చేసుకుంటున్న విజయ్ సేతుపతి ప్రస్తుతం ఒక్కో సినిమాకు 8 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకునే రేంజ్ కి వచ్చాడని టాక్.

