MoviesTollywood news in telugu

ఐటెం సాంగ్స్ కోసం పారితోషికాలు ఎలా ఉన్నాయో చూస్తే షాక్ అవ్వాలసిందే

Item song Remunerations : ఒకప్పుడు సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేయాలి అంటే జయమాలిని జ్యోతిలక్ష్మి సిల్క్ స్మిత వంటివారు ఉండేవారు. వారు ప్రత్యేకంగా ఐటెం సాంగ్స్ చేసేవారు. అయితే ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. స్టార్ హీరోయిన్స్ గా ఉన్న వారే ఐటెం సాంగ్ చేయటానికి సిద్దమవుతున్నారు. ఈ ట్రెండ్ మనవాళ్లు బాలీవుడ్ ను చూసి అనుసరిస్తున్నారు. ఇలా ఐటెంసాంగ్ చేయటం వలన పారితోషికం కూడా భారీగానే వస్తుంది దాంతో అటు వైపు మొగ్గు చూపుతున్నారు. తమన్నా శృతిహాసన్ పూజ హెగ్డే కాజల్ అగర్వాల్ వంటి వారు కూడా చేస్తున్నారు. ఇప్పుడు వస్తున్న కొత్త హీరోయిన్ కూడా ఐటెం సాంగ్ చేయడానికి రెడీ అయిపోతున్నారు.

హెబ్బా పటేల్
హీరోయిన్ గా పెద్దగా అవకాశాలు లేకపోవడంతో రెడ్ సినిమాలో ఐటమ్స్ సాంగ్ ఆఫర్ రావటంతో ఓకే చెప్పి చేసింది. దీని కోసం పదిహేను లక్షల రూపాయల పారితోషకం తీసుకుంది.

మోనాల్
బిగ్ బాస్ సీజన్ 4 లో మంచి క్రేజ్ సంపాదించిన మోనాల్ అల్లుడు అదుర్స్ సినిమాలో ఐటెం సాంగ్ చేసి 13 లక్షల రెమ్యునరేషన్ అందుకుంది

అనసూయ
బుల్లితెర ప్రేక్షకులకు అనసూయ అంటే తెలియని వారు ఎవరూ లేరు ఆమె వెండితెరమీద అవకాశం వచ్చిన ప్రతిసారి సద్వినియోగం చేసుకుంటోంది ప్రస్తుతం చావు కబురు చల్లగా సినిమాలో ఐటెం సాంగ్ కోసం 20 లక్షల రూపాయల పారితోషికం తీసుకుందని సమాచారం.

అప్సర రాణి
క్రాక్ సినిమాలో ఐటెం సాంగ్ చేసినందుకు 9 లక్షల రూపాయలు తీసుకుంది.

స్టార్ హీరోయిన్స్ ఐటెం సాంగ్ చేయటానికి సిద్ధంగా ఉన్నా వారికి దాదాపు 50 లక్షల దాకా రెమ్యునరేషన్ ఇవ్వాల్సి వస్తుంది అందుకే సినిమా అవకాశాలు లేని వారు అయితే అంత పెద్ద మొత్తంలో ఇవ్వాల్సిన అవసరం లేదని నిర్మాతలు అటువైపు దృష్టి సారించారు