MoviesTollywood news in telugu

డాక్టర్ కావాల్సిన యశస్వి సింగర్ ఎందుకు అయ్యాడో తెలుసా…నమ్మలేని నిజాలు

Singer yasaswi kondepudi : డాక్టర్ అవ్వకపోయి యాక్టర్ అయ్యానని, మరొకటి కాబోయి యాక్టర్ అయ్యానని సెలబ్రిటీలు చెప్పడం తెల్సిందే. కానీ ప్రజెంట్ సోషల్ మీడియా లో సింగర్ గా తన సత్తా చాటుతున్న యశస్వి కొండేపూడి కూడా డాక్టర్ కాబోయి సింగర్ అయ్యాడు. జీ తెలుగు ఛానెల్ లో ప్రసారమయ్యే సరిగమప….ది సింగింగ్ ఐకాన్ షో ద్వారా అందరికి సుపరిచితుడయిన యశస్వి అనే యువకుడు చిన్నపటి నుండి సంగీతం అంటే మక్కువ కావడంతో సంగీతం మీద ఉన్న ఆసక్తితో చిన్నప్పుడే సంగీతం నేర్చుకుని చిన్న చిన్న స్టేజి పెర్ఫార్మెన్సెస్ ఇస్తూ వచ్చాడు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కు చెందిన యశస్వి ని ముద్దుగా షన్ని అని పిలుస్తారట. తండ్రి పేరు శేఖర్. గవర్నమెంట్ హాస్పిటల్ లో ఉద్యోగం. తల్లి పేరు శ్రీదేవి. గృహిణి.

భాష్యం స్కూల్ లో చదువుతూనే చిన్నతనంలోనే కీబోర్డ్ నేర్చుకుంటూనే పాటలు పాడటం కూడా స్టార్ట్ చేసాడు. తన చిన్న నాటి నుండి శ్రీ ఝాన్సీ అనే అమ్మా యిని ప్రేమిస్తున్నాడు. ఆమె కూడా యశస్విని లవ్ చేస్తోంది. కాకినాడలో వీళ్లిద్దరూ ఒకటే స్కూల్లో చదువుకున్నారు. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే, యశస్వి 7వ క్లాసులో ఉన్నప్పుడు ఝాన్సీ కి ప్రపోస్ చేస్తే, ఆమె ఎనిమిదవ తరగతిలో ప్రేమకు ఓకే చెప్పిందట.

వచ్చే ఏడాది వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారని టాక్. ఇక తరువాత జీ తెలుగు ఛానెల్ లో ఛాన్స్ రావడంతో తన టాలెంట్ ని ప్రపంచా నికి పరిచయం చేసి తానేమిటో చాటిచెప్పాడు. అలాగే యశస్వి పాడిన సాంగ్స్ యూ ట్యూబ్ ని షేక్ చేస్తున్నాయి. ముఖ్యంగా పది మిలియన్ వ్యూస్ వచ్చాయి. యశస్వి చెల్లి కూడా సంగీతం నేర్చుకుంటూ ఇతని ట్రూప్ లోనే పాటలు కూడా పాడుతోంది.

ఆశ్చర్యం ఏమిటంటే, ఒకసారి యశస్వి చిన్నతనంలో ఎస్పీ బాలసుబ్రమణ్యం పాడిన ఒక పాటకి కీబోర్డు కూడా స్వయంగా తానే ప్లే చేశాడు. అప్పుడు బాలు చేతులమీదుగా అవార్డు కూడా తీసుకున్నాడు. యశస్వికి డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. ఇతను ఆంధ్రా కాలేజీలో మెడిసిన్ పూర్తి చేశాడు. వచ్చే ఏడాది డాక్టర్ కూడా అవుతాడు.

శర్వానంద్ నటించిన జానూ సినిమాలో లైఫ్ అఫ్ రామ్ అనే పాటను పాడడంతో ఆ పాట రాత్రికి రాత్రే ఒక పెద్ద సెన్సేషన్ క్రెయేట్ చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలోని ‘మగువా… మగువా’ సాంగ్ కూడా పాడేసి, మంచి గుర్తింపు కొట్టేసాడు. నిజానికి ఈ సినిమాలో ఒరిజినల్ గా పాడిన శ్రీ రామ్ కూడా యశస్వి ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు.

జీ తెలుగు ఛానెల్ లో ఇటీవల న్యూ ఇయర్‌ సెలబ్రేషన్‌లో భాగంగా `పార్టీకి వేళాయేరా` పేరుతో ఓ స్పెషల్‌ షో లో యశస్వి కి అనుకోని గిఫ్ట్ గా తన కళ్ళకి గంతలు కట్టి, తాను ఎంతగానో ప్రేమించిన ఝాన్సీని స్టేజి మీదకి రప్పించి యశస్వికి షో నిర్వాహకులు షాకిచ్చారు. తన లవర్ ని చూసిన యశస్వి ముఖం వెయ్యి ఓల్ట్స్ బల్బులా వెలిగిపోయింది.

తనని స్టేజి మీద ఎత్తుకుని తిప్పాడు .అంతేకాకుండా మొకాళ్ళ మీద కూర్చీని మరీ అందరి ముందు లవ్ ప్రపోజ్ చేసాడు. ఝాన్సీ కూడా యశస్వికి ముద్దు పెట్టింది. ఇక ఆడియన్స్ ఆనందంతో చప్పట్లు కొట్టి మరీ వారిని అభినందించారు. తన లైఫ్ లోకి వచ్చినందు కు యశస్వికి ఝాన్సీ థాంక్స్ చెప్పింది. ఝాన్సీ ప్రస్తుతం బి ఫార్మసీ చదువుతున్న ఆమె కూడా పలు వెబ్ సిరీస్ , షార్ట్ ఫిలిమ్స్ లో నటించడమే కాదు, పాటలు పాడుతోంది.