MoviesTollywood news in telugu

కెజిఎఫ్ కోసం యష్ తీసుకున్నదెంతో తెలుసా ?

KGF Movie :య‌ష్ … ఈ పేరు ఒక్కసారిగా కన్నడ ఇండస్ట్రీలో మారుమోగింది. సౌత్ లోనే కాదు, వరల్డ్ వైడ్ పేరొచ్చి, పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇందుకు కారణం కెజిఎఫ్. నిజానికి తెలుగు, తమిళ పరిశ్రమలతో పోలిస్తే, క‌న్న‌డ సినిమా ప‌రిశ్ర‌మ చిన్నదే. ఐదు ప‌దికోట్ల‌కు మించి బడ్జెట్ తో సినిమాలు తీయలేని పరిస్థిని ఒక్కసారిగా క‌న్న‌డ మూవీ మార్కెట్‌ను పెంచిన ఘనత కేజీయ‌ఫ్ మూవీకి దక్కింది. బంగారు గనుల నేపథ్యంలో వచ్చిన కెజిఎఫ్ అన్ని భాషల్లో సత్తా చాటింది.

కేజీయ‌ఫ్ ఛాప్ట‌ర్ 1 ప్యాన్ ఇండియా మూవీగా ఎలాంటి అంచ‌నాలు లేకుండా విడుద‌లై బాహుబ‌లి వ‌ల్ల ద‌క్షిణాదికి వ‌చ్చిన ప్యాన్ ఇండియా క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడు కెజిఎఫ్ 2 భారీ అంచనాలతో రూపుదిద్దుకుంటోంది. దీంతో ఒక్క‌సారిగా శాండిల్ వుడ్ రేంజ్ పెరిగిపోయింది. ఇప్పుడు బాహుబ‌లిని మించిన అంచ‌నాల‌తో కేజీయ‌ఫ్ ఛాప్ట‌ర్ 2 తెర‌కెక్కుతున్న ఈ సినిమాను జూలై 16న రిలీజ్ చేయాలనీ ప్రొడ్యూసర్స్ భావిస్తున్నారు. బంగారు గ‌నుల నేప‌థ్యంలో తెర‌కెక్కిన కేజీయ‌ఫ్ నిజంగానే హీరో య‌ష్ పాలిట బంగారు గ‌ని అయిందని టాక్.

ఈ సినిమాలో రాకీభాయ్ పాత్ర‌లో య‌ష్ న‌ట‌న సింప్లీ సూప‌ర్బ్‌. డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ రాసుకున్న క‌థానాయ‌కుడి పాత్ర‌ను య‌ష్ త‌న‌దైన న‌ట‌న‌తో వెండితెర‌పై అద్భుతంగా పండించాడు. ఈ సినిమా రెండు పార్టులుగా రూపొంద‌డానికి దాదాపు నాలుగేళ్ల స‌మ‌యం కనుక ఈ సినిమా కోసం య‌ష్ ఎంత రెమ్యున‌రేష‌న్ కూడా టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారింది. య‌ష్ కేజీయ‌ఫ్ కోసం ముప్పై కోట్ల రూపాయ‌ల రెమ్యున‌రేష‌న్‌ను తీసుకున్నాడ‌ట‌. పైగా లాభాల్లోనూ వాటా ఇచ్చేలా నిర్మాత‌లు ప్రామిస్ చేశార‌ని టాక్. ఏది ఏమైనా కెజిఎఫ్ సంచలనాలకు వేదికగా మారింది.