MoviesTollywood news in telugu

గంగ మంగ సినిమా గురించి నమ్మలేని నిజాలు…అసలు నమ్మలేరు

Ganga Manga Full Movie :ఎన్నో విజయవంతమైన సినిమాలు తీసిన విజయా సంస్థ ఉమా గౌరీ శంకరుల కథ తర్వాత ఐదేళ్ల విరామం తర్వాత గంగ మంగ మూవీ తీసింది. సూపర్ స్టార్ కృష్ణ, అందాల నటుడు శోభన్ బాబు కల్సి నటించిన ఈ మూవీలో వాణిశ్రీ ద్విపాత్రాభి నయం చేసింది. అప్పటి వరకూ ఎన్టీఆర్ హీరోగా సినిమా లు తీసిన ఈ సంస్థ తొలిసారిగా వేరే నటులతో తీసిన చిత్రం ఇదే కావడం విశేషం. నిజానికి కృష్ణ తండ్రి రాఘవయ్య చౌదరి , విజయా అధినేతల్లో ఒకరైన ఫాదర్ చక్రపాణి మంచి ఫ్రెండ్స్.

మొదట్లోనే చక్రపాణిని కల్సినప్పటికీ 94మూవీస్ లో నటించిన తర్వాత విజయా సంస్థలో గంగ మంగ ద్వారా కృష్ణకు ఛాన్స్ వచ్చింది. శోభన్ బాబుకి విజయాలో నటించిన ఏకైక చిత్రం ఇదే. వాణిశ్రీ డబుల్ రోల్ పోషిస్తే హీరోలకు ఇంపార్టెన్స్ ఏముంటుందని అనుకుంటారు కానీ, ఇందులో హీరోలకు కూడా మంచి రోల్స్ లభించాయి. క్లాస్ పాత్రకు కృష్ణను, మాస్ పాత్రకు చలం ను సెలెక్ట్ చేయాలన్న సూచన చక్రపాణికి వచ్చింది.

కానీ చక్రపాణి ఒప్పుకోకుండా మాస్ హీరో కృష్ణ ఆ పాత్రకు సూటవుతాడని చెప్పేసారు. డాక్టర్ రోల్ కి శోభన్ బాబుని సెలెక్ట్ చేసారు. తెలుగులోనే కాదు, తమిళంలో కూడా వాణి రాణి సినిమాలో కూడా వాణిశ్రీ డబుల్ రోల్ పోషించింది. శివాజీ గణేశన్, ముత్తురామన్ హీరోలుగా చేశారు. గీతా ఔర్ సీత హిందీ సినిమాలో స్కెటింగ్ ని లాంగ్ షాట్ లో చూపించి, బ్యాక్ ప్రొడక్షన్ లో పెద్ద బల్లవేసి దానిపై శోభన్ బాబు , వాణిశ్రీ నిలబడి కాళ్ళు చేతులు ఊపుతుంటే స్కెటింగ్ షాట్స్ గా తీశారు. ఈ మూవీ డైరెక్టర్ తాపీ చాణక్య మధ్యలోనే మరణించడంతో వి రామచంద్రరావు ఈ మూవీ పూర్తిచేశారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."