MoviesTollywood news in telugu

ఇంద్రనీల్-మేఘన పెళ్లి వెనుక దాగి ఉన్న నిజాలు

Meghana Indraneel :ప్రేమకు రంగు , ఎత్తు, లావు, డబ్బు, పర్సనాలిటీ ఇలా ఏమీ ఉండవు. అబ్బాయి చిన్నగా ఉన్నా, వయస్సులో పెద్దదైన అమ్మాయిని అయిన చేసుకోవచ్చు. అమ్మాయి చిన్నదైనా, అబ్బాయి పెద్దవాడైనా పెళ్లి చేసుకుంటారు. అదే ప్రేమలో ఉండే మజా. చూసేవాళ్లకు వేరేలా ఉండొచ్చు. కానీ ప్రేమకు ఇవేమీ అడ్డురావు. సీరియల్ యాక్టర్స్ ఇంద్రనీల్ – మేఘన కూడా అలాంటి అరుదైన ప్రేమ జంట.

అప్పట్లో పాపులర్ సీరియల్ చక్రవాకంతో ఇంద్రనీల్ – మేఘన బాగా ఆడియన్స్ దృష్టిలో పడ్డారు. ఇంద్రనీల్ హీరోగా చేస్తే, అతడికి అత్తగా మేఘన నటించింది. ఇలా అత్తా అల్లుడుగా చేసిన వీరి మధ్య పుట్టిన ప్రేమ మహా పాపం అయింది. అయితే వీరిద్దరిదీ ఒకే ఏజ్ కావడంతో ఇంద్రనీల్ వెంటపడి మరీ ప్రపోజ్ చేసి, ఆమె ప్రేమను పొందాక, పెళ్లిచేసుకున్నారు.

తాజగా శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కామెడీ షో పేరిట ఓ ఛానల్ లో జరిగిన కార్యక్రమానికి ఇంద్రనీల్, మేఘన హాజరయ్యారు. వీరి పెళ్లయి 16ఏళ్ళు అయినా ఇంకా వీరి మధ్య ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. రెండు గంటల్లో ప్రేమించడం ఎలా పేరిట ఈ షోకి లవ్ మ్యారేజ్ చేసుకున్న జంటలను పిలిచారు. పెళ్ళికి ముందు బొమ్మరిల్లు ఫాథర్ మాదిరిగా అన్నీ తండ్రే చూసుకుంటే, పెళ్లయ్యాక అన్నీ భార్య చూసుకుంటోంద ని చెప్పాడు. నాకన్నా పెద్దదిగా, లావుగా కన్పిస్తోందని చాలామంది ఇప్పటికీ కామెంట్స్ చేస్తున్నారని అయితే ఇవేమీ పట్టించుకోనని ఇంద్రనీల్ చెప్పుకొచ్చాడు.