టాలీవుడ్ కమెడియన్ కూతురుని గుర్తు పట్టారా……అయితే చూసేయండి

comedian ali daughter zuveria meethi :వారసత్వం అనేది సినిమాల్లో, రాజకీయాల్లో సర్వ సాధారణం అయిపొయింది. పైగా ఒక్కో ఫ్యామిలీ నుంచి ఇద్దరు ముగ్గురే కాదు పదుల సంఖ్యలో వచ్చేస్తున్నారు. దాంతో యాక్టర్ కొడుకు కచ్చితంగా యాక్టర్ అవుతున్నాడని తేలిపోయింది. హీరోల కొడుకులు వస్తున్నంతగా కూతుళ్లు మాత్రం రావడం లేదు. ఎందుకంటే, కూతుళ్ల విషయంలో మన హీరోలు కాస్త ఆలోచనలో పడుతున్నారు. ఫాన్స్ కూడా పెద్దగా ఒప్పుకోవడం లేదు. గతంలో కృష్ణ కూతురు హీరోయిన్ గా రావాలని చూస్తే, ఫాన్స్ వద్దని చాలా గొడవ చేసేసారు. దాంతో ఆ ప్రతిపాదన వెనక్కి వెళ్ళిపోయింది.

అయితే ఇప్పుడు కొందరు ముందడుగు వేస్తున్నారు. కొడుకు అయితే ఏంటి.. కూతురు అయితే ఏంటి అనుకుంటున్నారు. ఇప్పటికే అలా మెగా డాటర్ నిహారిక లాంటి వాళ్ళు కొందరు వచ్చారు. ఇప్పుడు అలీ వారసురాలు జువేరియా మీతి చైల్డ్ ఆర్టిస్టుగా ప్రస్థానం మొదలైంది. అలీ కూడా చిన్నపుడే తన నటన మొదలు పెట్టాడు. తాజాగా అలీ కూతురు నటించిన తొలి సినిమా విడుదలకు సిద్ధం అయింది. దాంతో సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్‌లో 9 ఏళ్ల చిన్నారి జువేరియా ముద్దు ముద్దు మాటలతో అందరినీ అలరించింది. లాక్ డౌన్ సమయంలో ఇంట్లో కూర్చుని అన్ని సినిమాలు చూస్తూ.. మన సినిమా కూడా ఇలాగే ఉంటుందా అని తనను అడిగేదని గుర్తు చేసుకున్నాడు.

అంతేకాదు పోస్టర్‌పై తన ఫోటో చూసి మురిసిపోయేదని, సూట్ కేసు నిండా డబ్బులు ఒకవైపు, తన బొమ్మ ఉన్న పోస్టర్ మరోవైపు పెడితే డబ్బులు వదిలేసి పోస్టర్ పట్టు కెళ్లేదని, కూతురు గురించి చెప్పాడు. గురువు ఎవ్వరూ లేకుండానే ఇండస్ట్రీకి వచ్చింది. లాయర్ విశ్వనాథ్ సినిమాలో జువేరియా తండ్రి అలీతో పాటు కలిసి నటించింది. తన సినిమా అంతా చూడాలని, ఈ సినిమా ఎప్పటికీ తన గుండెలో నిలిచిపోతుందని చెప్పుకొచ్చింది. ప్రతి తండ్రి మాదిరిగా కూతురు మాటలకు అలీ కూడా మురిసి పోయాడు. మరి తండ్రి పేరు కూడా నిలబెడుతుందని ఆశిద్దాం.