ఈ స్టార్ హీరోయిన్ ని గుర్తు పట్టారా…ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా?

Telugu actress nivetha thamous :యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభియనయం చేసిన జై లవకుశ సినిమాలో నటించి మంచి మార్కులు కొట్టేసిన నివేద థామస్ తన నటనతో ఆడియన్స్ మదిలో ముద్ర వేసుకుంది. అలాగే నిన్నుకోరి సినిమా కూడా నివేద కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచింది. ఇక కరోనా కారణంగా ఓటిటి లో రిలీజైన నాని – సుధీర్ బాబు ల సినిమా “వి” లో కూడా నివేదకు మంచి పాత్ర వచ్చింది.

ఇక సినీ ఇండస్ట్రీలోకి చాలా సంవత్సరాల క్రితమే నివేద థామస్ చైల్డ్ ఆర్టిస్ట్ గా దాదాపు పది సినిమాలకు పైనే చేసింది. ఇక టాలీవుడ్ లో నాని సరసన “జెంటిల్ మెన్” సినిమా లో హీరోయిన్ గా నివేద ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా హిట్ అవ్వడం తో ఆమెకు వరుస పెట్టి ఛాన్స్ లు బాగానే వచ్చాయి. అయితే తెలుగులో తక్కువ సినిమాలు చేసినప్పటికీ ఆడియన్స్ హృదయాల్లో పదిలంగా ఉంది.

ఇండస్ట్రీ లోకి వచ్చిన తొలిరోజుల్లో నివేద ఎక్కువ తమిళ్, మలయాళం సినిమాలలో నటించింది. “వెరుతు ఓరు భార్య” అనే మలయాళం సినిమాలో నివేద చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి, బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు కూడా అందుకుంది. ప్రస్తుతం ఆమె ఎంత క్యూట్ గా ఉంటుందో అంతకంటే ముద్దులొలికేలా ఉండేది. ఎందుకంటే, ఆమె చిన్నప్పటి ఫోటో చూస్తే ఇది అర్ధం అవుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమె చిన్ననాటి ఫోటో కూడా వైరల్ అవుతోంది.ఫాన్స్ కామెంట్స్ కూడా పెడుతున్నారు.