శృతి హాసన్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఎన్ని హిట్ అయ్యాయో…?

Shruti Haasan rejected Movies :కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతి హాసన్ మొదట్లో వరుస సినిమాలను చేయడం, కొన్ని హిట్ కొట్టినా, కొన్ని సరిగా ఆకట్టుకోకపోవడంతో ఆ మధ్య కేరీర్ పరంగా కొంత సతమతమయ్యింది. నిజానికి టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ కావడంతో అందులో నటించిన శృతి కెరీర్ కూడా మలుపు తిరిగింది. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే లండన్ ప్రేమికుడు మైఖేల్ మాయలో పడి కెరీర్ నిర్లక్ష్యం చేసుకుందన్న అపవాదు ఉంది. దాంతో అప్పట్లో ఆమెకు వచ్చిన ఛాన్స్ లు కూడా వదులుకుంది.

మహేష్ బాబు – పూరి జగన్నాధ్ కాంబినేషన్‌లో వచ్చిన బిజినెస్ మ్యాన్ సినిమాలో హీరోయిన్ గా మొదట శృతిని అనుకున్నారట. కానీ ఆమె ఏవో కారణాలతో రిజెక్ట్ చేయడంతో ఆ ఛాన్స్ కాజల్ అగర్వాల్‌కు దక్కడం, ఆ సినిమా మంచి విజయాన్ని అందుకోవడం తెలిసిందే. అలాగే ప్రభాస్ – లాఘవ లారెన్స్ కాంబినేషన్‌లో వచ్చిన రెబెల్‌లో కూడా శృతిని అనుకున్నా, ఆమె వదులుకోవడంతో తమన్నా చేసింది.

నాచురల్ స్టార్ నాని హీరోగా, గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో వచ్చిన జెర్సీ సినిమాలో కూడా శృతిని అనుకుంటే, కొన్ని కారణాల వల్ల ఈ సినిమా కూడా కోల్పోయింది. అలాగే అల్లు అర్జున్ -హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన దువ్వాడ జగన్నాధం మూవీలో కూడా శృతినే హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటే, ఆమె రిజెక్ట్ చేయడంతో పూజా హెగ్డేను తీసుకున్నారు. మాస్ మహారాజా రవితేజ – శ్రీను వైట్ల కాంబినేషన్‌లో వచ్చిన అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో కూడా శృతిని అనుకుంటే ఎందుకో వదిలేసింది.

అయితే మహేష్ బాబు – కొరటాల శివ కాంబోలో వచ్చిన శ్రీమంతుడు అలాగే రామ్ చరణ్ – వంశీ పైడిపల్లి కాంబోలో వచ్చిన ఎవడు మూవీస్ శృతికి మంచి పేరు తెచ్చాయి. ఇక చాలా గ్యాప్ తర్వాత తెలుగులో శృతి హాసన్ తాజాగా రవితేజ సరసన క్రాక్ సినిమాలో నటించి హిట్ అందుకుంది. ఇక పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న వకీల్ సాబ్ లో శృతి నటిస్తోంది. అలాగే కేజీయఫ్‌తో దేశ వ్యాప్తంగా పాపులరయిన దర్శకుడు ప్రశాంత్ నీల్ , ప్రభాస్‌తో చేస్తున్న సలార్ మూవీలో శృతి మెయిన్ రోల్ చేస్తోంది.