అరుంధతి సినిమాలో అనుష్కకి డబ్బింగ్ చెప్పిన టాప్ హీరోయిన్ ఎవరు?

Telugu actress anushka :’అరుంధతి’ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి అరుంధతి పాత్ర వేసిన అనుష్కకి ఎవరు డబ్బింగ్ చెప్పారా అని ఆలోచన రాక మానదు. ఎందుకంటే ఆ సినిమాలో అనుష్క హావభావాలకు బాగా సెట్ అయ్యే విధంగా డబ్బింగ్ చెప్పటం కుదిరింది.

అనుష్కకు డబ్బింగ్ చెప్పినది బుల్లితెర నటి శిల్ప. ఈమె సినిమాల్లో కూడా చిన్న చిన్న వేషాలు వేసేది. అలాగే సౌందర్య,ఆమని వంటి ఎంతో మంది హీరోయిన్స్ కూడా డబ్బింగ్ చెప్పింది. శిల్ప మొదట దూరదర్శన్ లో సీరియల్స్ లో నటించేది. ఒక పాత్ర పండాలంటే ఆర్టిస్ట్ హావభావాలతో పాటు డబ్బింగ్ కూడా ముఖ్యమే. శిల్ప డబ్బింగ్ అనుష్క పాత్రలకు ప్రాణం పోస్తుందంటే అతిశయోక్తి కాదేమో.దాదాపుగా అనుష్క అన్నీ సినిమాలకు శిల్ప డబ్బింగ్ చెప్పింది.