MoviesTollywood news in telugu

సీతారామరాజు సినిమా గురించి నమ్మలేని నిజాలు…ఎన్ని కోట్ల లాభమో…!?

Seetaramaraju Full Movie :వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన సీతారామరాజు ఓ డిఫెరెంట్ మూవీ. అక్కినేని నాగార్జున, నందమూరి హరికృష్ణ అన్నదమ్ములుగా నటించిన ఈ మూవీ అప్పట్లో ఓ సంచలనం. నిజానికి ఎన్టీఆర్, అక్కినేని ఎన్నో సినిమాలు కల్సి చేసినప్పటికీ వాళ్ళ వారసులుగా ఎంట్రీ ఇచ్చిన నాగార్జున, బాలకృష్ణ మాత్రం కల్సి నటించే ఛాన్స్ రాలేదు. ఎందరో ప్రొడ్యూసర్స్ ఈ కాంబోలో మల్టీస్టారర్ చేయాలన్న ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. కానీ హరికృష్ణ లో కూడా నటుడు ఉండడంతో ఈ సినిమాతో నాగ్, హరికృష్ణ కల్సి నటించారు.

గోవిందా గోవిందా, క్రిమినల్ సినిమాలకు అసోసియేట్ గా చేసిన వైవిఎస్ చౌదరి జడ్జిమెంట్ మీద నాగ్ కి నమ్మకం వచ్చింది. నిన్నే పెళ్లాడతా మూవీకి కూడా అసోసియేట్ గా చేసినపుడు బ్లాక్ బస్టర్ అవుతుందని వైవిఎస్ చెప్పాడు. ఇచ్చినమాట ప్రకారం కొత్తవారితో సీతారాముల కళ్యాణం మూవీకి వైవిఎస్ కి డైరెక్షన్ ఛాన్స్ నాగ్ ఇవ్వడం అది కూడా హిట్ కావడంతో తానే హీరోగా చేయడానికి కథ రెడీ చేయమని నాగ్ అడిగాడు.

అలా నాగ్ కోసం కథ కోసం వైవిఎస్ కసరత్తు స్టార్ట్ చేసాడు. దాన వీర సూర కర్ణ తర్వాత 20ఏళ్ళ గ్యాప్ తర్వాత హరికృష్ణ రీ ఎంట్రీ ప్రకటన రావడం, నాగ్ సినిమాలో అన్నయ్య పాత్రకు హరికృష్ణను అడగడం ఒప్పేసుకోవడం అన్నీ చకచకా జరిగిపోయాయి. సాక్షి శివానంద్, సంఘవి హీరోయిన్స్ . కోట శ్రీనివాసరావు, నిర్మల, రవితేజ,బ్రహ్మాజీ, చంద్రమోహన్ సత్యప్రకాష్ తారాగణం.

కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్. పోసాని కృష్ణమురళి డైలాగ్ వెర్షన్ రాసారు. 1998సెప్టెంబర్ నుంచి సీతారామరాజు షూటింగ్ స్టార్ట్ . డి శివప్రసాద రెడ్డితో కల్సి నాగ్ సొంతంగా ఈ మూవీ నిర్మించారు. అన్నపూర్ణ స్టూడియోలో ఎక్కువ భాగం షూట్ చేసి, మిగిలిన చోట్ల కూడా షూటింగ్ పూర్తిచేయడంతో 1999లో ఆడియో రిలీజ్ అయింది. నాగ్ సిగరెట్ మీద సాంగ్ పాడడం గ్రేట్. ఫిబ్రవరి 5న గ్రాండ్ గా ఈ మూవీ రిలీజ్.

అక్కినేని, నందమూరి ఫాన్స్ కల్సి థియేటర్స్ దగ్గర హంగామా చేసారు. నాగ్, హరికృష్ణ ల మధ్య సీన్స్, రవితేజ ట్విస్ట్, నిర్మలమ్మ ట్విస్ట్, హరికృష్ణ చనిపోయే సీన్ ఇలా అన్నీ ఈ సినిమాకు కుదరడంతో మంచి టాక్ తెచ్చుకుంది. హరికృష్ణ ఒక్కడే ఇంట్లో ఉండగా జరిగే ఫైట్, హరికృష్ణను కారులో నిద్రపోతుండగా, నాగ్ చేసే ఫైట్స్ సూపర్భ్ . ఫాక్షన్ నేపధ్యం తలపించేలా తీసిన ఈ మూవీ అప్పట్లో సెన్షేషన్ హిట్ కొట్టింది. మాస్ ఆడియన్స్ ని అలరించేలా వైవిఎస్ పవర్ ఫుల్ గా ఈ మూవీ తీసాడు.

అయితే ఇన్ని అంశాలున్నా అప్పట్లో ఎబో ఎవెరెజ్ గా నిల్చింది. ఎందుకంటే అప్పటికే సమరసింహారెడ్డి ఇండస్ట్రీ హిట్ గా దూసుకుపోయే క్రమంలో ఉండడం, ఇక క్షత్రియ పుత్రుడు తెలుగులో అప్పటికే ఆదరణ పొందడం , అదే స్పూర్తితో సీతారామరాజు రావడం, మైనస్ అయింది. ఇక ఈ మూవీ రిలీజ్ కి 10రోజుల ముందు అన్న తెలుగుదేశం అనే పార్టీని హరికృష్ణ ప్రకటించడం నందమూరి ఫాన్స్ లో తేడా కొట్టింది. మొదటి వారం 4కోట్లు కలెక్షన్ తెచ్చి, 50రోజుల వరకూ బాగా ఆడినా తరవాత డ్రాప్ అయింది.