MoviesTollywood news in telugu

రాజేంద్ర ప్రసాద్ ఆస్తులు పోవటానికి కారణం వారేనట…ఎవరో…!?

Tollywood Hero Rajendra Prasad :అయినవాళ్లే మోసం చేస్తారు. దెబ్బకొడతారు. ఉన్నది ఊడ్చుకుపోతారు. సరిగ్గా నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ విషయంలో ఇలాగే జరిగింది. ఈ విషయం ఓ ఇంటర్యూలో స్వయంగా వెల్లడించడం విశేషం. అలనాటి ఎన్టీఆర్ స్పూర్తితో సినిమాల్లోకి వచ్చిన రాజేంద్ర ప్రసాద్ కి అనుకోకుండానే అవకాశాలు వచ్చాయి. 70ల్లో తన ఇంజనీరింగ్‌ పూర్తవగానే ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేరి, ఆ తర్వాత అక్కడ్నుంచి, పెద్దగా కష్టపడకుండానే సినిమాల్లోకి వచ్చేసాడు. వచ్చిన తర్వాత నిలదొక్కుకోడానికి చాలా కష్టపడ్డాడు. ఎందుకంటే అప్పటికే ఏఎన్నార్‌, ఎన్టీఆర్‌, శోభన్‌బాబు, కృష్ణ తెలుగు ఇండస్ట్రీని ఏలుతున్నారు.

అప్పట్లో కొత్త హీరో ఆదరణ పొందాలంటే, ఏదో ఒక వెరైటీ ఉండాలి. ఆలోచించి, చివరకు చార్లీ చాప్లిన్ రూట్ ఎంచుకుని, అలా కామెడీ సినిమాలు చేసుకుంటూ పోయానని, కానీ ఒకానొక సమయంలో తనను సొంత వాళ్లే ఆర్థికంగా మోసం చేసారని రాజేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చాడు. అప్పటి వరకు సంపాదించిందంతా ఊడ్చుకుపోయారని, నమ్మిన వాళ్లే ఇంత దారుణంగా మోసం చేస్తారని కలలో కూడా ఊహించలేదని వాపోయాడు.

నిజానికి రాజేంద్రప్రసాద్ వచ్చిన తర్వాత కామెడీ హీరోలు వచ్చారు. సినిమాలో ఎక్కడో ఓ చోట కామెడీ కాకుండా సినిమా అంతా కామెడీతోనే నడిపించడం చాలా కష్టం. కానీ దాన్ని ఎన్నో సినిమాల్లో రాజేంద్ర ప్రసాద్ చేసి చూపించాడు. ఇప్పటికీ వరస సినిమాలు చేస్తూనే బిజీగా ఉన్న రాజేంద్ర ప్రసాద్ ఆమధ్య ఆ నలుగురు, శ్రేయోభిలాషి మూవీస్ తో మంచి నటుడిగా మరింత మెప్పు పొందాడు. మహానటి, కొక్కొరొక్కో వంటి సినిమాలు చేస్తున్న రాజేంద్ర ప్రసాద్ మొన్న క్లైమాక్స్ సినిమాతో పలకరించి, ఇప్పుడు అనిల్ రావిపూడి రాసిన కథతో ‘గాలి సంపత్’ మూవీతో వస్తున్నాడు. నమ్మిన వాళ్లే తనను దారుణంగా మోసం చేస్తే, రోడ్డున పడి దెబ్బతిన్న రాజేంద్రప్రసాద్ మళ్ళీ నిలదొక్కుకుని రాణిస్తుండడం గ్రేట్ అని పలువురు నెటిజన్స్ అంటున్నారు

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."