కమల్ తొలి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?

kamal haasan first remuneration :సినిమా తారలు రాజకీయాల్లోకి రావడం,కొందరు పార్టీలు పెట్టడం అన్ని భాషా రంగాల్లోనూ ఉంది. ఇప్పుడు సౌత్ ఇండియా సూపర్ స్టార్ కమల్ హాసన్ కూడా సినిమాలు చేస్తూనే రాజకీయాల్లోకి వచ్చారు. పార్టీ పెట్టి ప్రస్తుతం తమిళనాట జరిగే ఎన్నికల్లో పోటీకి దిగుతున్నారు. ఇలా సినిమాల్లో సత్తా చాటుతూనే, రాజకీయాల్లో కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న కమల్ ఇటీవల తరచూ మీడియాతో మాట్లాడుతున్నాడు.

ఓ పక్క అధికార అన్నా డీఎంకే, మరోవైపు ప్రధాన విపక్షం డీఎంకే ల వైఖరిని తూర్పార బాదుతూ, రాష్ట్రంలో చాలా సంవత్సరాల నుంచి రెండు ప్రధాన రాజకీయ పార్టీలు ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తున్నారని తాజాగా ఒక కార్యక్రమంలో మాట్లాడిన కమల్ హాసన్ ధ్వజమెత్తాడు. తన సినీ, రాజకీయ జీవితం గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు.

తన పార్టీ ద్వారా ప్రజలతో పాటు రాజకీయాల్లో కూడా చైతన్యం తెస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. తాను బ్లాక్ మనీ రూపంలో రెమ్యునరేషన్ తీసుకున్న దాఖలాలు లేవని, అందుకే రెమ్యునరేషన్ కూడా పెరగదని కమల్ అన్నారు.అంతేకాకుండా తాను ప్రతి ఏటా ఖచ్చితంగా పన్ను చెల్లిస్తానని, అందుకే తాను ఎవరికీ భయపడేదిలేదని కమల్ హాసన్ తెలిపారు.

నటుడిగా తాను అనుకున్న స్థాయిలో సక్సెస్ ను సాధించానని ఇక ప్రజలకే జీవితాన్ని అంకితం చేస్తానని కమల్ ప్రకటించాడు. ఒకవేళ రాజకీయాల్లో విజయం దక్కకపోయినా సినిమాల విషయంలో హీరోగా తనకు ఎలాంటి సమస్య ఉండదని తేల్చేసాడు. పైగా కమల్ రాజకీయాల్లో సక్సెస్ ఈజీ కాదని నెటిజన్ల కామెంట్స్ వస్తున్నాయి. ఇక తొలి సినిమా రెమ్యునరేషన్ గురించి ప్రస్తావిస్తూ, నగదు రూపంలో .కేవలం 4వేల రూపాయలు తీసుకున్నానని చెప్పాడు.