శాకుంతలం కోసం అక్కినేని కోడలు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

Shakuntalam movie Samantha :అక్కినేని నాగార్జున కోడలు సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం శాకుంతలం భారీ బడ్జెట్‌తో రూపొందబోతోంది. గతేడాది జాను సినిమాతో ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోని సమంత శాకుంతలం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంటానని భావిస్తున్నారు. ఈ సినిమాకు సమంత 3 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టాక్ వైరల్ అవుతోంది. ఈ మూవీ కోసం ఏకంగా 150 డేస్ డేట్లు ఇచ్చిందని అంటున్నారు.

రుద్రమదేవి లాంటి హిస్టారికల్ మూవీ చేసిన గుణశేఖర్ దర్శకత్వం లో పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కుతోంది. గుణ టీం వర్క్స్ బ్యాన్‌పై నీలిమ గుణ ఈసినిమా నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో శాకుంతలం సినిమా కోసం భారీ సెట్స్ నిర్మించారు. ప్రీ ప్రొడక్షన్ కంప్లీట్ అవడంతో తాజాగా ఈ సినిమా ప్రారంభోత్వవం పూజా కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించారు. త్వరలో శాకుంతలం సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తారు.

ఏ మాయ చేశావె సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమంత ఎన్నో పాత్రల్లో నటించినప్పటికీ పౌరాణిక పాత్రలో చేయడం ఇదే తొలిసారి. ఇది సక్సెస్ కొడితే మరిన్ని పౌరాణిక సినిమా ఛాన్స్ లు వస్తాయని విశ్లేషిస్తున్నారు. ఇక ఈసినిమాలో దుష్యంతు డిగా దేవ్ మోహన్ నటిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నిర్మాణ సంస్థ కూడా ఈ సినిమాకి భాగస్వామ్యం అవుతోంది. ఈ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్‌లో దిల్ రాజు భాగమవడంతో మరింత క్రేజ్ వచ్చింది