రాహుల్ రామకృష్ణ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
Rahul Ramakrishna movies :ఈమధ్య స్టార్ కమెడియన్స్ కి డిమాండ్ తగ్గినప్పటికీ కొత్తగా వస్తున్న కమెడియన్స్ కి మంచి ఛాన్స్ లు వస్తున్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గ రాహుల్ రామకృష్ణ ఈ నెల 11వ తేదీన “జాతిరత్నాలు” సినిమాలో ఆడియన్స్ ని ఆకట్టుకున్నాడు. జాతిరత్నాలు సినిమాకు రికార్డు స్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయి. జాతిరత్నాలు మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రాహుల్ రామకృష్ణ మీడియాతో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు.
ఈ మూవీలో రవి పాత్రలో నటించగా, తన పాత్రకు ఆడియన్స్ నుంచి అనుకున్న స్థాయిలో రెస్పాన్స్ వస్తోందని రాహుల్ రామకృష్ణ చెప్పుకొచ్చాడు. ఈ మూవీ కథ వింటున్న సమయంలోనే తనకు నవ్వు ఆగలేదని కథను బాగా ఎంజాయ్ చేశానని అయితే, ఆడియన్స్ రిసీవ్ ఎలా ఉంటోండోనన్న భయం ఉండేదని చెప్పాడు. కానీ తన పాత్రకు ఆడియన్స్ నుంచి స్పందన చూసాక సినిమా విషయంలో తనకు ఉన్న అనుమానాలన్నీ పోయాయని రాహుల్ రామకృష్ణ చెప్పుకొచ్చాడు.
జాతిరత్నాలు సినిమాకు హాస్యమే బలమని రాహుల్ రామకృష్ణ చెబుతూ, నిజానికి పాత్రల మధ్య కథ పెద్దగా లేకున్నా, హాస్యం ప్రధానంగా ఈ సినిమా తెరకెక్కిందని స్పందించాడు. తనకు ప్రియదర్శితో గత 12 సంవత్సరాల నుంచి పరిచయం ఉందని జాతిరత్నాలు సినిమాతోనే నవీన్ పోలిశెట్టితో పరిచయం ఏర్పడిందన్నాడు. కాగా సినిమాల్లోకి రాకముందు జర్నలిస్ట్ గా పని చేశానని, సినిమా రిపోర్టర్ అవ్వాలని భావించి ఇండస్ట్రీకి వచ్చి, చివరకు సినిమాలలో హాస్య భరిత పాత్రలలో చేస్తున్నానని చెప్పాడు.

