MoviesTollywood news in telugu

బాలకృష్ణ,విజయశాంతి కాంబినేషన్ లో వచ్చిన సినిమాల్లో ఎన్ని హిట్…!?

Balakrishna and vijayashanti Movies :ఇప్పుడంటే రెండు మూడు సినిమాలకు హీరోయిన్ ని మార్చేస్తున్నారు కానీ, ఒకప్పుడు పదుల సంఖ్యలో హీరో, హీరోయిన్స్ కల్పి సినిమాలు వచ్చేవి. హిట్ ఫెయిర్ జంటగా పేరుకూడా తెచ్చుకున్న హీరో హీరోయిన్స్ ఉన్నారు. ఇక నందమూరి నటసింహం బాలకృష్ణ , లేడీ అమితాబ్ విజయశాంతి కలిపి 17సినిమాలు చేసారు. 1984లో కథానాయకుడు మూవీతో వీరిద్దరి కాంబినేషన్ స్టార్ట్ అయింది. సూపర్ హిట్ కొట్టి, సిల్వర్ జూబ్లీ గా నిలవడంతో ప్రతియేటా రెండు సినిమాలు రిలీజయ్యేవి.

బాలయ్య సొంత సినిమా పట్టాభిషేకంలో వీరిద్దరూ కల్సి నటించిన రెండో సినిమా. రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చినా ఆశించిన స్థాయిలో విజయం దక్కలేదు. భార్గవ్ ఆర్ట్స్ బ్యానర్ లో బాలయ్యతో కల్సి విజయశాంతి కల్సి నటించిన తొలిసినిమా ముద్దుల క్రిష్నయ్య . ఇది బ్లాక్ బస్టర్ అయింది. అలాగే దేశోద్ధారకుడు వీరి కాంబోలో వచ్చిన మరో మూవీ. ఇది కూడా విజయం సాధించింది. ఇక బాలయ్య డబుల్ రోల్ వేసిన అపూర్వ సహోదరులు మూవీలో కూడా విజయశాంతి ఒక పాత్ర పోషించింది. ఇది మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఇక భార్గవరాముడు మూవీ వీరిద్దరి కాంబోలో వచ్చింది.

సాహస సామ్రాట్ మూవీ లో కూడా బాలయ్య , విజయశాంతి కలిపి నటించారు. ఇది పెద్దగా ఆడలేదు. మువ్వగోపాలుడు మూవీలో కూడా వీరిద్దరూ కల్సి నటించారు. వినోదాత్మకంగా వచ్చిన భానుమతి గారి మొగుడు మూవీ రికార్డు స్థాయిలో ఆడింది. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన ఇనస్పెక్టర్ ప్రతాప్ మూవీలో ఇద్దరూ నటించగా, బంపర్ హిట్ అయింది. అలాగే ముద్దుల మావయ్య కూడా వీరిద్దరి కాంబోలో వచ్చిన సూపర్ హిట్ మూవీ.

ఇక ముద్దుల మేనల్లుడు బాలయ్య, విజయశాంతి కాంబినేషన్ లో వచ్చి, మంచి హిట్ కొట్టింది. బి గోపాల్ డైరెక్షన్ లో పక్కా మాస్ కాంబినేషన్ లో వీరిద్దరూ కల్సి లారీ డ్రైవర్ సినిమాలో నటించారు. తాతినేని రామారావు డైరెక్షన్ లో వచ్చిన తల్లిదండ్రులు మూవీలో కల్సి నటించారు. తర్వాత రౌడీ ఇన్స్పెక్టర్ మూవీలో ఆటో రాణి గా మాస్ క్యారెక్టర్ చేసింది. సినిమా హిట్ అయింది. బొగ్గు గని కార్మికుడిగా బాలయ్య నటించిన నిప్పురవ్వ మూవీలో విజయశాంతి హీరోయిన్ గా చేయగా, ఆమె భర్త శ్రీనివాస ప్రసాద్ ప్రొడ్యూసర్ కావడం విశేషం. ఈ సినిమా లేటవ్వడం, బంగారు బుల్లోడు రిలీజ్ కి బాలయ్య అనుమతి ఇవ్వడంతో బాలయ్య, విజయశాంతి మధ్య శతృత్వానికి దారితీసింది. దీని తర్వాత ఇద్దరి కాంబినేషన్ లో మూవీ లేదు. 28ఏళ్లయినా ఇద్దరూ మళ్ళీ కల్సి నటించలేదు.