2014లో కన్నుమూసిన సెలబ్రిటీలు ఎంత మంది ఉన్నారో…!?

2014 Tollywood Actors Died :ప్రతియేటా జనన మరణాలు సహజం అయితే 2014లో చాలామంది సెలబ్రిటీలు వివిధ కారణాల వలన తనువు చాలించారు. లవర్ బాయ్ గా చిత్రం సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఎన్నో విజయాలను అందుకున్న హీరో ఉదయ కిరణ్ జనవరి 5న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లవకుశ సినిమాతో తెలుగు జనాలకు సీతాదేవిగా గుర్తుండిపోయిన అంజలీదేవి ఒకప్పుడు హీరోయిన్ గా వెలుగొంది, ఆతర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో చేసారు. అన్ని రకాల పాత్రలతో మెప్పించిన అంజలీదేవి 86వ ఏట జనవరి 13న కన్నుమూశారు.

తెలుగు సినిమా రంగంలో రెండుకళ్ళలో ఒక కన్ను గా భాసిల్లిన లెజెండరీ హీరో అక్కినేని నాగేశ్వరరావు 240కి పైగా సినిమాల్లో నటించి అన్ని రకాల పురస్కారాలను అందుకున్నారు. అక్కినేని బ్రాండ్ ని పదిలపరిచి జనవరి 22న ఈ లోకం నుంచి వీడారు. విలనిజం తో పాటు హాస్య పాత్రలతో ఆకట్టుకున్న తెలంగాణ శకుంతల జూన్ 14న గుండెపోటుతో కన్నుమూసింది. 1940లో ఓ గ్రామం మూవీతో ఉత్తమ నటుడిలా గా నంది అవార్డు అందుకున్న నటుడు ముక్కురాజు అసలు పేరు సాగింరాజు రాజన్ రాజు అనారోగ్యం కారణంగా జులై 31న కన్నుమూశారు.

ఏదైనా బొమ్మ చూసినా, అందగత్తెను చూసినా అచ్చం బాపు బొమ్మలా ఉందని అంటాం. అంతలా లెజండరీ స్థాయికి చేరిన దర్శకుడు బాపు ఆగస్టు 31న మరణించారు. జూనియర్ ఎన్టీఆర్ కి అన్నయ్య, నందమూరి కళ్యాణ్ రామ్ కి తమ్ముడు అయిన నందమూరి జానకిరామ్ సినిమా ప్రొడ్యూసర్ గా ప్రత్యేక స్థానం తెచ్చుకున్నాడు. డిసెంబర్ 6న రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు.

క్యారెక్టర్ ఆర్టిస్టుగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా పేరొందిన పిజె శర్మ డిసెంబర్ 14న గుండెపోటుతో కన్నుమూశారు.కమల్ హాసన్, రజనీకాంత్ వంటి సూపర్ స్టార్ లను పరిచయం చేసిన లెజండరీ డైరెక్టర్ కె బాలచందర్ తన 84ఏళ్ల వయస్సులో డిసెంబర్ 23న కన్నుమూశారు.